15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టుని పూర్తిగా నల్లగా మార్చే అద్భుతమైన పద్ధతి

Loading...
మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో తెల్ల జుట్టును నల్లపర్చే అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కేవలం మనం ఇంట్లో తయారు చేసుకుని ఆచరించి కూడా సమస్యను అదిగమించొచ్చు. జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు తెల్లబడడమూ ఆగిపోతుంది. ఇక అప్పటి నుంచి వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడం ప్రారంభిస్తాయి. దీన్ని వంశ పారంపర్యంగా బట్టతల ఉన్న వేలాది మందిపై ప్రయోగించగా విజయవంతమైంది. పలు కేసుల్లో 70 సంవత్సరాల వయసు వారికీ నల్లబడడం కనిపించింది. అప్పటి నుంచి ఆయుర్వేద వైద్యంలో దీనిని భాగం చేశారు. కింది పదార్థాల్లో కొన్ని మన ఇంట్లో లభించేవి కాగా మిగిలినవి అన్ని ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి.
కావల్సిన పదార్థాలు:
మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు
కాఫీ పొడి- 3గ్రాములు
పెరుగు-25గ్రాములు
నిమ్మరసం- 4స్పూన్లు
ఖదిరము(కటేచు)- 3గ్రాములు
బ్రహ్మి చూర్ణం- 10గ్రాములు
ఉసిరి చూర్ణం- 10గ్రాములు

అన్నింటిని బాగా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లబడుతుందని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
Loading...

Popular Posts