ఇది తాగితే 15 రోజుల్లో మీ ఎముకలు బలంగా ఉక్కు కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి

మనుషుల శరీరానికి ఎముకలు పునాది లాంటివి. ఇవి శరీరంలోని అనేక కదలికలు, పనితీరులను, అవయవాలకు రక్షణ కల్పించడం వంటి.. కీలక పాత్రలు పోషిస్తాయి. బ్లడ్ సెల్స్, స్టోరేజ్ మినరల్స్, ఎండోక్రైన్ రెగ్యులేషన్ వంటి వాటి పనితీరు బాధ్యత ఎముకల నిర్మాణానిదే. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు కూడా ఎముకలే.. రక్షణ కల్పిస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెయింటెయిన్ చేయడం కూడా.. చాలా ముఖ్యం. సరైన డైట్ పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇన్ఫెక్షన్స్, వారసత్వం, ఇతర వ్యాధి లక్షణాల వల్ల కూడా ఎముకల వ్యాధులు ఎదురవుతాయి.
ఎప్పుడైతే ఎముకలు బలహీనమవుతాయో.. కదలికలకు ఇబ్బందిగా మారుతుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతారు. దాంతో పాటు కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఎముకలు ఎప్పుడు బలంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక నెలలో ఎముకలను న్యాచురల్ గా బలంగా మార్చుకోవాలి అంటే.. ఈ క్రింది విధంగా తయారుచేసుకున్న డ్రింక్ ని తాగండి.
కావాల్సిన పదార్థాలు :-
తేనె 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు 1 టేబుల్ స్పూన్
గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం :-
పైన చెప్పిన పదార్థాలన్నింటిని సరైన మోతాదులో తీసుకుని అన్నింటినీ బాగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక కప్పు వేడి పాలలోకి పైన గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత.. తాగాలి. ఈ డ్రింక్ ని ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి.

తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలు.. ఎముకలను బలంగా మార్చేస్తాయి. క్రమం తప్పకుండా.. నెల రోజులపాటు రెగ్యులర్ గా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, హెల్తీగా మారుతాయి. ఈ మూడింటి మిశ్రమం క్యాల్షియం గ్రహించే సత్తాను ఎముకల్లో పెంచుతుంది. విటమిన్ డి, ఇతర మినరల్స్, అందించి, ఆరోగ్యంతో పాటు, పోషణను అందిస్తాయి. ఈ న్యాచురల్ హెల్త్ డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలకు హాని కలిగించే ఇన్ఫెక్షన్స్, ఇన్ల్ఫమేషన్ నివారిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)