ఇత‌రుల‌ను ఆక‌ట్టుకునేలా అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా మారేందుకు అద్భుతమైన 15 టిప్స్

Loading...
ఇత‌రుల‌ను ఆక‌ట్టుకునేలా అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి? నేటి త‌రుణంలో కేవ‌లం మ‌హిళ‌లే కాదు పురుషులు కూడా అందంగా క‌నిపించాల‌ని త‌ప‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో బ్యూటీ పార్ల‌ర్లు, స్పాల‌కు వెళ్ల‌డం, అందాన్ని పెంచుకోవ‌డం కోసం ఫేస్‌ప్యాక్‌ల వంటి ప‌ద్ధ‌తులు పాటించ‌డం అన్నీ చేస్తున్నారు. అయితే ఇవ‌న్నీ కృత్రిమ‌మైన‌వి. ఇవి కేవ‌లం కొంత మందికి మాత్ర‌మే ప‌డ‌తాయి. అధిక శాతం మందికి ర‌సాయ‌నాల‌తో త‌యారు చేసిన కాస్మొటిక్స్ ప‌డ‌వు. అయితే అలాంటి వారితోపాటు ఎవ‌రైనా కూడా కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే చ‌ర్మం మ‌రింత మెరుస్తూ కాంతివంతంగా మార‌డ‌మే కాకుండా అందంగా క‌నిపించేందుకు అవ‌కాశం ఉంటుంది.

1. కొన్ని న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తీసుకుని బాగా న‌లిపి ముఖంపై రాయాలి. కొంత సేప‌టి త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. నిత్యం ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

2. కీర‌దోస జ్యూస్‌, గ్లిజ‌రిన్‌, రోజ్ వాట‌ర్‌ల‌ను తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు పోతాయి. ఎండలో బ‌య‌టికి వెళ్లి వ‌చ్చిన వారి చ‌ర్మానికి ఈ మిశ్ర‌మం ఇంకా బాగా ప‌నిచేస్తుంది.

3. శాండల్‌వుడ్ పౌడ‌ర్‌, ప‌సుపు, పాల‌ను కొద్ది మొత్తంలో తీసుకుని పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. దీన్ని ముఖంపై రాసి కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖానికి మెరుపు వ‌స్తుంది.

4. కొద్దిగా తేనె, పాల‌పై మీగ‌డ‌ను తీసుకుని బాగా క‌లిపి ముఖంపై రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ఉన్న చ‌ర్మం మృదుత్వాన్ని, కాంతిని సంత‌రించుకుంటుంది.

5. కొద్దిగా పాలు, ఉప్పు, నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని ముఖానికి రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ప‌డిన మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.

6. కొన్ని ట‌మాటాల‌ను తీసుకుని జ్యూస్‌లా చేసి దాంట్లో కొంత నిమ్మ‌ర‌సం పిండి అనంత‌రం ఆ మిశ్ర‌మానికి ముఖానికి ప‌ట్టించాలి. కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖానికి మృదుత్వం చేకూరుతుంది.

7. ప‌సుపు, గోధుమ పిండి, నువ్వుల నూనెల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు పోతాయి.

8. కొంత క్యాబేజీని తీసుకుని జ్యూస్‌లా చేయాలి. దాంట్లో కొద్దిగా తేనె క‌లిపి ముఖానికి రాసుకుని అనంత‌రం క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ఏర్ప‌డ్డ ముడ‌త‌లు త‌గ్గిపోతాయి.

9. కొన్ని క్యారెట్ల‌ను తీసుకుని జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి. దాన్ని ముఖంపై రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖం స‌హ‌జ సిద్ధ‌మైన మెరుపును పొందుతుంది.

10. మూడు భాగాల తేనె, ఒక భాగం దాల్చిన చెక్క పొడిని తీసుకుని పేస్ట్‌లా చేసి మొటిమ‌ల‌పై రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. తెల్ల‌వార‌గానే క‌డిగేయాలి. దీని వ‌ల్ల మొటిమ‌లు పోవ‌డ‌మే కాదు, మ‌చ్చ‌లు కూడా తొల‌గిపోతాయి.

11. ప‌ల్లి నూనెలో కొంత నిమ్మ‌ర‌సం క‌లిపి ముఖానికి రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల మొటిమ‌లు, బ్లాక్‌హెడ్స్ దూర‌మ‌వుతాయి.

12. అలోవేరా జ్యూస్‌ను ముఖానికి రాసి కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల చ‌ర్మానికి కాంతి చేకూర‌డ‌మే కాదు, మ‌చ్చ‌లు కూడా పోతాయి.

13. కొద్దిగా నెయ్యి తీసుకుని అందులో కొంత గ్లిజ‌రిన్ క‌లిపి ముఖానికి రాయాలి. దీని వ‌ల్ల ముఖంపై ఉన్న చ‌ర్మం మృదువుగా మారుతుంది.

14. ముల్తానీ మ‌ట్టి, గులాబీ పువ్వు రేకులు, వేపాకులు, తుల‌సి ఆకుల పొడి, రోజ్ వాట‌ర్‌ల‌ను క‌లిపి త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని ముఖానికి రాస్తుంటే ముఖం కాంతివంత‌మ‌వుతుంది.

15. యాప్రికాట్స్ పండ్ల‌ను కొన్నింటిని తీసుకుని వాటిని గుజ్జు గుజ్జుగా మిక్సీ ప‌ట్టాలి. అందులో కొంత పెరుగు, తేనెల‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాస్తుంటే డ్రై స్కిన్ పోయి ముఖం మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది.
Loading...

Popular Posts