క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనడానికి 10 లక్షణాలు... ముందుగానే గుర్తించి జాగ్రత్త పడడం మంచిది.

క్యాన్సర్ వ్యాధి ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మనం తాగే నీటి నుండి పీల్చుకునే గాలి వరకూ అన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలో మనం నిర్లక్ష్యం వహిస్తాం. చిన్న చిన్న లక్షణాలు రేపు పెద్దవిగా మారి ప్రాణాపాయం తలబెట్టే ప్రమాదం ఉంది. ఇలాంటిది జరగకముందే మనం జాగ్రత్త వహిస్తే ముప్పు తప్పుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనడానికి 10 లక్షణాలు సేకరించాము. అలా అని ఈ లక్షణాలు ఉంటే మీకు క్యాన్సర్ వస్తుందని కాదు. ఈ లక్షణాలు మీలో ఉన్నట్టు మీకు అనిపిస్తే తక్షణమే వైద్య సేవలు అందుకోవడం మంచిదని చెబుతున్నాము.
ఎక్కువగా అలసిపోవడం
సాధారణంగా మనం ఎక్కువగా అలసిపోయినప్పుడు... ఎక్కువ సేపు నిద్రిస్తే ఆ అలసట దూరమవుతుంది. కానీ మన శరీరంలోని మంచి కణాలతో.... క్యాన్సర్ కణాలు నిరంతరం పోరాడటం వల్ల మనం అధికంగా అలసిపోతాము.
బరువు తగ్గడం
క్యాన్సర్ సోకినా వారిలో 40 శాతం మంది ఆకస్మికంగా బరువు కోల్పోతున్నారని ... ఎన్నో ఏళ్లుగా క్యాన్సర్ పై జరుపుతున్న అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎక్కువగా తలనొప్పి
తలనొప్పి ఆగకుండా విపరీతంగా వస్తుందంటే బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే వాంతులు, చూపు మందగించడం వంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
అజీర్ణం
అజీర్ణం అనేది సర్వ సాధారణం. ఇది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ చాలా రోజుల నుండి మిమల్ని ఇబ్బంది పెడుతుంది అంటే మీ కడుపులో క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
చర్మం కింద గడ్డలూ
చర్మం కింద గడ్డల లాగా ఏదైనా తగిలితే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని అంటున్నారు వైద్యులు. ఇవి వేడి వల్లనో లేక ఇంకేదైనా కారణాల వల్ల వచ్చి ఉంటే ఒక వారంలో తగ్గిపోవాలి. అలాకాకుండా వారానికన్నా ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఇవి ఎక్కువగా ఆడవారిలో చాతిలోను, మగవారిలో వృషణాల లోనూ వస్తుంటాయి.
ఆగకుండా దగ్గు వస్తుంటే
కొందరు ఏవైనా చల్లటి పదార్థాలను పుచ్చుకున్నపుడు జలుబు, దగ్గు అనేవి రావటం సహజం. కానీ ఏ కారణం లేకుండా ఆగకుండా దగ్గు వస్తుందంటే.... అది ఊపిరితిత్తుల క్యాన్సర్ అయి ఉండచ్చు అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పొగతాగే వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్లను సంప్రదించడం మంచిది.
అసాధారణ రక్తస్రావం
క్యాన్సర్ తుది దశలో ఉన్నప్పుడు అసాధారణ రక్తస్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. దగ్గినప్పుడు రక్తం వస్తుందంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, మలం లో రక్తం వస్తుందంటే పెద్దప్రేగు లేదా మల క్యాన్సర్, మూత్రంలో రక్తం వస్తుందంటే పిత్తాశయమును (బ్లాడర్) లేదా మూత్రపిండాల క్యాన్సర్, ఆడవారి రోమ్ములనుండి రక్తం వస్తుందంటే రొమ్ము క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నోటి లోపల తెల్లని మచ్చలు
నోటి లోపల తెల్లని మచ్చలు ఉంటే... ఇది ల్యూకోప్లాకియా లేదా ఓరల్ క్యాన్సర్ అయిఉండవచ్చు. ముఖ్యంగా పొగతాగే వారు, గుట్కా, తంబాకు లాంటివి తినేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.
పిత్తాశయం (బ్లాడర్) లో మార్పులు
మూత్రంలో రక్తం లేదా విపరీతమైన నొప్పి వస్తుందంటే అది మూత్రాశయం లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ అయ్యుండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్లను సంప్రదించడం మంచిది.
చర్మం లో మార్పులు
పుట్టు మచ్చలు లేదా పులిపిరి కాయలు ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి. ఇవి పెద్దగా మారడం లేదా వీటి పై వెంట్రుకలు మొలవటం లాంటివి జరిగితే అది స్కిన్ క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. వీటిని తుది దశలోనే తొలగించగలిగితే ఎలాంటి ప్రమాదము ఉండదు.

క్యాన్సర్ సోకిన వారిలో ఈ 10 లక్షణాలను ఎక్కువగా చూసామంటున్నారు వైద్యులు. అలా అని.. ఈ లక్షణాలు ఉన్నవారందరికీ క్యాన్సర్ వస్తుందని..... అలానే ఇవి లేని వారికి క్యాన్సర్ రాదని అనుకోవద్దని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మీ శరీరంలో ఎలాంటి అసాధారణ మార్పులు జరిగినా వెంటనే డాక్టర్లను సంప్రదించడం చాలా మంచిది. వీలైనంత త్వరగా దీనిని గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)