ఒక్క తులసి ఇంట్లో ఉంటే....100 మంది డాక్టర్లు ఉన్నట్టే

Loading...
హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

అయితే పూజనీయమైనదే కాక తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ.. మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి

కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.

జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది. ముఖ్యంగా 7, 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటారు. ఆకలి లేదంటుంటారు. అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

తులసి ప్రధానంగా జ్వరహారిణి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. పైగా టైఫాయిడ్ జ్వరంలో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూటా తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది.

ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. ఉబ్బస నివారణ ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు.

మీ దంతాలు ఆరోగ్యంగా తెల్లగా మెరిసిపోవాలంటే తులసి టూత్ పౌడర్‌ను ట్రై చేసి చూడండి.
తులసి టూత్ పౌడర్ తయారీ :
తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత, ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్‌చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా, మీ రెగ్యులర్ పేస్ట్‌కు తులసి పౌడర్‌ను జతచేసి, బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా, ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
Loading...

Popular Posts