ఫ్రూట్స్ తింటే మంచిదే కదా అని ఎక్కువ తింటే అసలుకే ఎసరు పెడతాయి కాబట్టి ఎంతెంత తినాలో చూడండి

Loading...
  • యాపిల్ - యాపిల్ ని రోజుకి ఒకటి తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా.. రెడ్ యాపిల్ కంటే.. గ్రీన్ యాపిల్ మంచిది. ఎందుకంటే.. గ్రీన్ యాపిల్స్ లో 20 గ్రాములు కార్బోహైడ్రేట్స్, గ్లిజమిక్ ఇండెక్స్ 39 ఉంటుంది.
  • ఆరంజ్ - ఆరంజ్ లలో విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించి, ఇన్సులిన్ లెవెల్ ని పెంచుతాయి. అంతేకాకుండా.. వీటిలో హెస్పెరెటిన్ ఉంటుంది. అలాగే యాంటీ ఒబేసిటీ ఎఫెక్ట్ ఉండటం వల్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఆరంజ్ ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు.
  • జామకాయ - జామకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే.. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. హై ఫైబర్, ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు.
  • నేరేడు పళ్లు - బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయాలంటే.. రోజుకి 5 నుంచి 6 నేరేడు పళ్లు తీసుకోవాలి.
  • బొప్పాయి -  ఒక కప్పు నిండా బొప్పాయి ముక్కలు అప్పుడప్పుడు తీసుకోవచ్చు.
  • స్ట్రాబెర్రీస్ - ఒక కప్పు లేదా ఒక గిన్నె అంటే 180 గ్రాముల స్ట్రాబెర్రీస్ ను తినవచ్చు. స్ట్రాబెర్రీస్ లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీని మెరుగుపరుస్తాయి.
  • అరటిపండు - అరటిపండు రెండు లేదా మూడు తీసుకోవచ్చు. దీనివల్ల బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ లో ఉంటుంది.
  • పుచ్చకాయ - 100 గ్రాములు లేదా ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్లో 90 శాతం నీళ్లు, 30 శాతం క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఇవి గ్లూకోజ్ లెవెల్స్ మెయింటెయిన్ చేయడంలో, బరువు తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం లంచ్ తర్వాత వీటిని తీసుకోవచ్చు. కానీ రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది.
  • పైనాపిల్ - పైనాపిల్ లో తక్కువ క్యాలరీలుంటాయి. అలాగే బ్లడ్ గ్లూకోజ్ హఠాత్తుగా పెరగడానికి కూడా కారణమవదు. అయితే 3/4 వంతు కప్పు పైనాపిల్ ముక్కల కంటే... ఎక్కువ తీసుకోకూడదు.
Loading...

Popular Posts