సరిగ్గా ఉడకని చికెన్ తింటే.. ప‌క్ష‌వాతం వ‌చ్చే ప్రమాదం.. మాంసాహార ప్రియులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమిది!

సరిగ్గా ఉడకని చికెన్ తింటే.. డ‌యేరియా, క‌డుపునొప్పి, అజీర్తి మాత్రమే వస్తాయని మనకు తెలుసు. కానీ అలా ఉడ‌క‌ని చికెన్ తిన‌డం వ‌ల్ల ఆ అనారోగ్యాలు మాత్ర‌మే కాదు.. కొంద‌రిలో ప‌క్ష‌వాతం వ‌చ్చే ప్రమాదం కూడా ఉంటుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెబుతోంది కాదు, సాక్షాత్తూ సైంటిస్టులు ప‌రిశోధించి చెబుతున్న స‌త్య‌మే ఇది..!

అమెరికాలోని మిషిగాన్ స్టేట్ యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ వెట‌ర్న‌రీ మెడిసిన్ వైద్య బృందం తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే… చికెన్‌ను స‌రిగ్గా ఉడికించ‌క‌పోవ‌డం వ‌ల్ల అందులో సాల్మొనెల్లా కాంపిలోబాక్ట‌ర్‌, సాల్మొనెల్లా టైపి, క్యాపిలోబాక్ట‌ర్ జెజునీ అనే 3 ర‌కాల బాక్టీరియాలు మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయ‌ట‌. ఇవి మ‌నం తిన్న ఆహారంలో క‌లిసి అనంత‌రం నేరుగా రక్త ప్ర‌స‌ర‌ణ‌లో చేరుతాయి. అప్పుడు ఆ ర‌క్తంలో ఉండే ఆ బాక్టీరియాలు మ‌న‌కు డ‌యేరియా, క‌డుపునొప్పి, వాంతులు, ర‌క్త విరేచ‌నాలు, టైఫాయిడ్ జ్వ‌రం, త‌ల‌నొప్పి వంటి అనారోగ్యాలు తెచ్చి పెడ‌తాయి. దీంతోపాటు ర‌క్తంలో ఉన్న బాక్టీరియా ఎముక‌ల‌కు చేరితే దాంతో ఆస్టియోమైలిటిస్ అనే ఎముక‌ల వ్యాధి, గుండెకు చేరితే పెరికార్డ‌యిటిస్‌, మెనింజైటిస్‌, లివ‌ర్‌కు చేరితే హెప‌టైటిస్‌, ఊపిరితిత్తుల‌కు చేరితే న్యుమోనియా, పేగుల‌కు చేరితే ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయ‌ట‌.

అయితే ఆ బాక్టీరియాలు నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌పై కూడా ఒక్కోసారి ప్ర‌భావం చూపుతాయ‌ట‌. అలా గ‌న‌క జ‌రిగితే మెద‌డు లేదా వెన్నెముక‌ల్లో ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంద‌ట‌. అది గులియ‌న్ బార్ సిండ్రోమ్‌కు దారి తీసి అనంత‌రం కాళ్ల నుంచి మొద‌లై చేతుల వ‌ర‌కు పాకి చివ‌ర‌కు ప‌క్ష‌వాతం వ‌స్తుంద‌ట‌. ఇదీ ఉడ‌క‌ని చికెన్‌పై ఆ వైద్య బృందం చేసిన ప‌రిశోధ‌న‌. ఈ క్ర‌మంలో అలాంటి చికెన్‌ను గ‌న‌క తింటే ప్ర‌తి 2వేల మందిలో ఒక‌రికి క‌చ్చితంగా ప‌క్ష‌వాతం వ‌స్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. అదే గ‌న‌క జ‌రిగితే మెద‌డుతో స‌హా ఇత‌ర అవ‌య‌వాలు చ‌చ్చుబ‌డిపోతాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక మీరు ఎప్పుడు చికెన్ తిన్నా అది స‌రిగ్గా ఉడికింద‌ని నిర్దార‌ణ అయితేనే తినండి. లేదంటే తినొద్దు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. చికెన్ స‌రిగ్గా ఉడ‌కాలంటే 165 డిగ్రీల ఫారెన్ హీట్ వ‌ర‌కు ఉడికించాలి. అంటే క‌నీసం 73 డిగ్రీల వ‌ర‌కు చికెన్‌కు వేడి త‌గిలేలా ఉడికించాలి. అప్పుడే అందులో ఉండే బాక్టీరియాలు పోతాయి.

Popular Posts

Latest Posts