మీకు తెలుసా..? మగాళ్లకు ప్రవేశంలేని ఆల‌యాలు ఉన్నాయ‌ని.. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.. ఈ ఆల‌యాల్లోకి పురుషుల‌కు అనుమ‌తి లేదు

మీకు తెలుసా..? పురుషుల‌ను అనుమ‌తించ‌ని ఆల‌యాలు కూడా కొన్ని ఉన్నాయ‌ని..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆ ఆల‌యాల్లోకి కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే వెళ్తారు. పురుషులు వెళ్ల‌రు. కాదు, పురుషుల‌కు అనుమ‌తి లేదు. ఆ ఆల‌యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్ర‌హ్మ దేవాల‌యం, పుష్క‌ర్, రాజ‌స్థాన్‌…
ప్ర‌పంచంలో బ్ర‌హ్మ దేవుడికి ఆల‌యాలు అస్స‌లు లేవు. కానీ రాజస్థాన్‌లోని పుష్క‌ర్ ప్రాంతంలో ఉన్న ఆల‌య‌మే బ్ర‌హ్మ‌కు ఉన్న ఏకైక ఆల‌య‌మ‌ని చెబుతారు. అయితే ఈ ఆలయంలోకి మాత్రం పురుషుల‌ను అనుమ‌తించ‌రు. ఎందుకంటే ఒకానొక‌ప్పుడు ఈ ప్రాంతంలో బ్ర‌హ్మ త‌న భార్య స‌ర‌స్వ‌తితో క‌లిసి య‌జ్ఞం చేయాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలో తీరా య‌జ్ఞం అయ్యే స‌మ‌యానికి స‌రస్వ‌తి రాలేదు. దీంతో బ్ర‌హ్మ గాయ‌త్రిని అక్క‌డికక్క‌డే వివాహ‌మాడి ఆమెతో య‌జ్ఞం పూర్తి చేసేస్తాడు. అనంత‌రం వ‌చ్చిన స‌ర‌స్వ‌తి జ‌రిగింది తెలుసుకుని బ్ర‌హ్మ‌ను శ‌పిస్తుంది. ఆ ఆల‌యంలోకి ఇక పురుషులు ప్ర‌వేశించ‌కూడ‌ద‌ని, అలా చేస్తే వారికి వివాహ జీవితంలో అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ని ఆమె చెబుతుంది. దీంతో అప్ప‌టి నుంచి ఆ ఆల‌యంలోకి పురుషులు ప్ర‌వేశించ‌డం లేదు.

అట్టుక‌ల్ దేవాల‌యం, కేర‌ళ‌…
కేర‌ళ‌లో ఉన్న అట్టుక‌ల్ దేవాల‌యంలో పార్వ‌తీ దేవి కొలువై ఉంది. ఆ దేవ‌త‌ను ద‌ర్శించుకునేందుకు ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది భ‌క్తులు వ‌స్తారు. అయితే వారంద‌రూ మ‌హిళ‌లే. ఒక్క పురుషుడు కూడా దేవాల‌యంలోకి వెళ్ల‌డు.

దేవీ ఆల‌యం, కన్యా కుమారి…
కన్యా కుమారిలో ఉన్న దుర్గా దేవీ ఆల‌యంలోకి కూడా పురుషులు వెళ్ల‌రు. ఈ ఆల‌యం చుట్టూ మూడు మ‌హా స‌ముద్రాలు ఉన్నాయి. అవి 1. బంగాళాఖాతం, 2. హిందూ మ‌హా స‌ముద్రం, 3. అరేబియా మ‌హా స‌ముద్రం. దేశంలో ఉన్న దుర్గా దేవి శ‌క్తి పీఠాల్లో ఓ శ‌క్తి పీఠం ఇక్క‌డ ఉంద‌ని చెబుతారు. ఇక్క‌డి దుర్గా దేవిని భాగ‌తీ మాత‌గా పిలుస్తారు.

చ‌క్కులాతుక‌వు దేవాల‌యం, కేర‌ళ‌…
కేర‌ళ‌లో ఉన్న ఈ ఆల‌యంలో దుర్గా దేవి కొలువై ఉంది. ఏటా ఈ ఆల‌యంలో ఒక వారం పాటు నారీ పూజ నిర్వ‌హిస్తారు. అప్పుడు కేవ‌లం మ‌హిళ‌లు మాత్రమే ఆల‌యంలో ఉండాలి. పురుషుల‌కు స్థానం లేదు. అప్పుడు వారం పాటు మ‌హిళ‌లంతా ఉప‌వాసం ఉండి దేవిని కొలుస్తారు.

మాతా ఆలయం, ముజ‌ఫ‌ర్‌పూర్‌, బీహార్‌…
బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లో ఉన్న మాతా ఆల‌యంలో ఏటా కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో పూజ‌లు చేస్తారు. ఆ స‌మయాల్లో ఆల‌యంలోకి పురుషుల‌ను అనుమ‌తించ‌రు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)