ఈ మాత్ర వేసుకుంటే గుండె పోటు మళ్లీ రాదట !

గుండెపోటు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని కబలిస్తున్న మహమ్మారి. దీనిని ముందుగా గుర్తించడం చాలా కష్టం. చాలా మందికి మొదట్లో చిన్నస్థాయిలో గుండెపోటు (మైనర్‌ హార్ట్‌ ఎటాక్‌) వస్తుంది. దీనిని గుర్తించి వెంటనే ‘ఆస్పిరిన్‌’ మాత్రలు వేసుకుంటే మరోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతోందట. యూరోపియన్‌ పరిశోధకుల బృందం ఈ విషయాన్ని కనిపెట్టింది.

‘మినీ స్ర్టోక్‌ లేదా గుండెపోటు సంబంధిత లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ సలహా అవసరం లేకుండానే ఆస్పిరిన్‌ వేసుకోవాలి. అలా వేసుకుంటే తర్వాతి రోజుల్లో వచ్చే మేజర్‌ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. ఆస్పిరిన్‌ వేసుకుంటే రెండోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం పదిహేను శాతం తగ్గుతుంది. ముందు వచ్చిన మినీ హార్ట్‌ ఎటాక్‌ కంటే వెంటనే లేదా కొద్ది రోజుల తర్వాత వచ్చే మేజర్‌ హార్ట్‌ ఎటాక్‌ వెయ్యి రెట్లు తీవ్రంగా ఉంటుంది. అయితే దానిని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఆస్పిరిన్‌కు ఉంద’ని ఆ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)