Loading...

సాధారణంగా బట్టలను లేదా వాటి క్లాత్‌ను తయారు చేసే కంపెనీలు దుస్తులు ముడతలు పడకుండా, చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించేందుకు పలు రకాల కెమికల్స్, డైలు వాడతారు. వాటిలో ప్రధానంగా ఫార్మాల్డిహైడ్ రెసిన్, అజో అనిలిన్ డైలు ఉంటాయి. ఇవి మన చర్మానికి హాని కలిగిస్తాయి. కొత్త బట్టల్లో ఈ కెమికల్స్ అలాగే ఉంటాయి. కనుక వాటిని మనం అలాగే వేసుకుంటే దాంతో ఆ కెమికల్స్ మన చర్మానికి తగిలి చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. దీంతో పాటు మనం బట్టల షాపుల్లో బట్టలను కొనేటప్పుడు మనకన్నా ముందు ఎంతో మంది వాటిని వేసుకుని ఉంటారు కదా. అలా వేసుకోవడం వల్ల వారికి చెందిన దుమ్ము, ధూళి, వెంట్రుకలు, డెడ్ స్కిన్ సెల్స్ ఆ బట్టల్లోకి చేరుతాయి. అప్పుడు ఆ బట్టలను అలాగే వేసుకుంటే అవన్నీ మన శరీరంపైకి చేరి అనారోగ్యాలను కలిగిస్తాయి. కనుక సైన్స్ పరంగా చెప్పాలంటే కొత్త బట్టలను వేసుకునే ముందు వాటిని కచ్చితంగా ఓసారి ఉతకాల్సిందే..!
ఈ క్రమంలో మన పూర్వీకులు కూడా కొత్త బట్టలను వేసుకునే ముందు ఒకసారి వాటిని ఉతకాలనే చెబుతున్నారు. ఎందుకంటే వెనుకటికి కొత్త బట్టలు వేసుకున్న వారు తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారట. దీంతో ఆ దుస్తులపై ప్రతికూల శక్తుల ప్రభావం ఉంటుందని భావించి వాటిని ఉతకమని, అనంతరమే వాటిని వేసుకోవాలని చెబుతూ వస్తున్నారు. అలా వేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు రావని, ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదని పెద్దల నమ్మకం. అందుకే వారు కొత్త బట్టలను ఒక్కసారైనా కచ్చితంగా ఉతికి ఆ తరువాతే వేసుకోవాలని చెబుతున్నారు. అయితే కొత్త బట్టల విషయంలో మన పూర్వీకులు చెప్పిన వాటిలో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే… శుక్రవారం బట్టల కొనుగోలుకు చాలా మంచిదట. శనివారాల్లో బట్టలను అస్సలు కొనుగోలు చేయవద్దట. అంతేకాదు, కొత్త దుస్తులను కూడా ఆ రోజు ధరించవద్దట..!
Loading...
MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఎంతో కొంత సహాయం చేసి ప్రాణాలు కాపాడండి
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉన్నవారికి డేటా ఎంట్రీ వర్క్ కలదు. 2009 నుండి కచ్చితమైన పేమెంట్స్ ఇస్తున్న అత్యంత నమ్మకమైన సంస్థ. ఎటువంటి టార్గెట్స్ లేకుండా మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు.డేటా ఎంట్రీ ద్వారా నెలకి 18000 సంపాదన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
