భర్తకు ఈ విషయాలను చెప్పడానికి భార్య ఇష్టపడదట అవేంటో తెలుసా ?

స్త్రీల మదిలో ఉన్న విషయాన్ని కనిపెట్టడం ఆ బ్రహ్మ తరం కూడా కాదనే సామెత ఉన్నట్లే స్త్రీకి ఓ విషయం తెలిస్తే వీధంతా తెలుస్తుందనే నానుడి కూడా ఉంది. అయితే ఎవరెన్ని అన్నా.. భర్తకు కూడా కొన్ని విషయాలను చెప్పకుండా భార్య దాస్తుందట. ఆ విషయాలను చెప్పడానికి భార్య ఇష్టపడదట. అవేంటో తెలుసా మరి ?

1. భార్య తనకు ఏదయినా అనారోగ్యం కలిగితే వెంటనే భర్తకు తెలియజేయరు. ’ఇంత చిన్న విషయమే కదా.. తగ్గిపోతుందిలే.. అనవసరంగా వారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు’ అనే భావనలో భార్యలు ఉంటారట. తన అలసటను, అనారోగ్యాన్ని భర్తే స్వయంగా గుర్తిస్తే అమితంగా సంతోషపడతారట.

2. శృంగార పరంగా తన సంతృప్తినిగానీ, అసంతృప్తిని గానీ భర్తకు భార్య తెలియజేయదట. తన భావనను అసలు బయటకు రానీయరట. దీని గురించి ఎంత గుచ్చిగుచ్చి అడిగినా భార్య స్పందించరట. ఏదోటి చెప్పి విషయాన్ని దాటవేస్తారట.

3. భార్య తనకుతానుగా ఏదయినా విజయం సాధిస్తే వెంటనే భర్తకు తెలియజేయరట. భర్త తనకు తానుగా గుర్తించి అభినందించాలని వారు కోరుకుంటారట. అయితే భార్యల విజయాన్ని చాలామంది భర్తలు తేలికగా తీసుకుంటారట.

4. బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా స్త్రీలు బయటపెట్టరట. భార్య దగ్గర ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడం భర్త తరం కాదని అంటుంటరు. బ్యాంకు అకౌంట్‌లోనో, పోపుల డబ్బాలోనో, బీరువాలోని చీరల మడతల్లోనో ఎక్కడ పడితే అక్కడ వారు డబ్బు దాచుకుంటుంటారట.

Popular Posts

Latest Posts