ఉదయం తీసుకునే ఆహారమే మనకి చాలా ముఖ్యం అలా అని ఏది పడితే అది తినకుండా వీటిని తీసుకోండి

ఉదయం పూట మనం తీసుకునే ఆహారమే రోజంతా మనలో ఉత్తేజాన్ని నింపుతుంది. కనుక తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగని, ఉదయం పూట కేకులు, చక్కెర, వెన్నతో చేసినవి మాత్రం వద్దు. వీటివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. అంతేకాదు, వేయించిన బంగాళాదుంపల్ని అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు.

ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం ఉత్తమం. త్వరగా తయారవుతాయని నూడుల్స్‌ను ఆరగించరాదు. వాటిల్లో సొడియం అధికం. ఇలాంటి మసాలా కలగలిసిన వాటిని తీసుకుంటే ఎండలో వెళ్ళినప్పుడు వికారంగా ఉంటుంది. సమయం చూసుకొని తేలిగ్గా అరిగే మామూలు అల్పాహారం తీసుకోవడం మంచిది. కొందరు రాత్రి మిగిలిన చికెన్‌ వంటకాలను మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్‌ ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయి.

కొందరు పండ్ల రసాలను తయారుచేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ ఇప్పటికప్పుడు చేసిన వాటికే ప్రాధాన్యమివ్వాలి. ముందురోజు చేసిన వాటిని మర్నాడు ఉదయం తాగడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా చేరుతుంది. పోషకాలు సరిగా అందవు. ఇక ఉదయం పూట గుడ్డు తినడం చాలా మంచిది. అయితే నూనెలో ఫ్రై చేయకుండా తినాలి. మధ్యాహ్నం, రాత్రి పూట ఫ్రైలా తీసుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఉదయం తీసుకోవడం వల్ల అధిక శాతం కొలెస్ట్రాల్‌ శరీరానికి చేరుతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తీసుకొంటే చాలు.

Popular Posts

Latest Posts