రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే ఎన్ని లాభాలో మీరే చూడండి

ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిపోయాక కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేగాక, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధిపడి రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. సహజమైన తీపి ఉన్న బెల్లం శరీర శక్తిని చాలావరకు పెంచుతుంది.

ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చలికాలంలో దగ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... రక్తప్రసరణ బాగా జరుగుతుందట. ఇంటి నుంచి బయలుదేరే ముందు బెల్లం తినడం వల్ల మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మనశ్శాంతిని పెంచుతుంది. ఇందులో ఎలాంటి రసాయన పదార్థాల వాడకం ఉండదు. ఇక నుంచి ఆ బెల్లమే కదా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడప్పుడు చిటికెడుబెల్లాన్ని నోట్లో వేసుకోండి.

Popular Posts

Latest Posts