చేపల కోసం వల వేస్తే.. 670 కోట్లు దొరికాయి..!

Loading...
దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వక పోవడం అంటే ఇదే. అతని వద్ద ఉన్న ఓ విలువైన వస్తువు ఏమిటో తెలియక దాచి పెట్టి మరచి పోయాడు. ఆ వివరాలలోకి వెళితే.. ఒక మత్స్యకారుడి వద్ద గత 10 ఏళ్లుగా ఉన్న అత్యంత అరుదైన ఒక ముత్యం 2 రోజుల క్రితమే వెలుగు లోకి వచ్చింది. ఫిలిప్పీన్స్ కి చెందిన ఆ మత్స్యకారుడు 2006 లో పాలవాన్ ద్వీపంలో చేపల వేటకు వెళ్లిన సందర్భరంలో పడవకు లంగరు వేస్తుండగా ఒక పెద్ద రాయి అడ్డుపడింది. అయితే అది.. తెల్లగా, వింత ఆకృతిలో ఆకర్షించే విధంగా ఉండటంతో దానిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తాను పడుకునే మంచం కింద పెట్టుకుని మరచిపోయాడు.

అయితే.. ఈ క్రమంలో ఒక రోజు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో సామానులన్నీ బయట పడేస్తున్న సమయంలో ఈ రాయి బయటపడింది. అయితే, అప్పటికే దీని సంగతి మర్చిపోయిన సదరు మత్స్యకారుడి దృష్టి దీనిపై పడి.. ఆ రాయి తీసుకొని వెళ్లి స్థానిక టూరిజం అధికారులకు చూపించాడు. దానికి ఫొటో తీసి.. దానిని సామాజిక మాధ్యమాల్లో అధికారులు పోస్ట్ చేశారు. అది రాయి కాదని, ముత్యం కావచ్చని ఈ సందర్భంగా వారికి తెలిసింది.

ఆ తర్వాత దానిని పరీక్షించి చూడగా అత్యంత అరుదుగా లభించే ముత్యమని స్పష్టం అయింది. సుమారు 34 కిలోలు బరువున్న ఈ ముత్యం 2.2 అడుగుల పొడవు కూడా ఉంది. దీని విలువ సుమారు 100 మిలియన్ డాలర్లు (670 కోట్లు) ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ అరుదైన ముత్యం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జెమాలజిస్ట్ ల వద్దకు దీనిని తీసుకువెళ్లనున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...