Loading...

ముందు రెండు గ్లాసులు నూకలబియ్యం కాని మామూలు బియ్యం కానీ ఒక బౌల్ లో తీసుకుని శుభ్రం గా కడిగి, నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి అరగంట నానపెట్టాలి..
ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న బౌల్ పెట్టి , అందులో 10 గ్లాసుల నీళ్ళుపోసి ఒక స్పూన్ సాల్ట్ వేసి మరిగించాలి. ఇప్పుడు నానపెట్టిన బియ్యం లో నీళ్ళు తీసేసి ఆ బియ్యాన్ని మరుగుతున్న నీటిలో వెయ్యాలి. ఒక 20 నిమిషాలకి బియ్యం ఉడికి అన్నం అవుతుండగా, ఒక కప్ రాగిపిండిని తీసుకుని కొద్ది కొద్దిగా ఆ ఉడికే అన్నం లో పోస్తూ ఉండకట్టకుండా జాగ్రత్తగా గరిటె తో కదుపుతూ పదినిమిషాలు మొత్తం రాగిపిండి, అన్నం మిశ్రమాన్ని ఉడికించాలి.. ఇలా మొత్తం మిశ్రమం దగ్గరపడ్డాకా స్టవ్ మీదనుండి దించేసి వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్ లో చన్నీళ్ళు తీసుకుని ఆనీటితో చేతిని తడి చేసుకునిఈ ఉడికిన రాగి అన్నాన్ని ముద్దలుగా చేసుకోవాలి ఇలా చేసినదాన్నే రాగిసంకటి అనిపిలుస్తారు..
వేడి వేడిగాఉన్న రాగిసంకటి లో నెయ్యి వేసుకుని నాన్ వెజ్ అంటే నాటుకోడిపులుసు లాంటివాటితో తింటారు.. నాన్ వెజ్ అలవాటు లేనివాళ్ళు పల్లీలు అదే వేరుశనగగుళ్ళ తో చేసిన పచ్చడి తో తింటారు..
పల్లీల పచ్చడి ఎలా తయారు చెయ్యాలంటే ముందు ఒక బాండీ స్టవ్ మీదపెట్టి, అందులో ఒక కప్ పల్లీలు వేసి వేయించి, వేడిచల్లారాకా పొట్టు తీసి పక్కనపెట్టుకోవాలి.. ఇప్పుడు అదే బాండీలో, ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాకా అందులో 6 పచ్చిమిర్చి ని ముక్కలుగా చేసి వేసి ,ఒక స్పూన్ జీలకర్రని వేసి వేయించి తీసెయ్యాలి.ఇప్పుడు కొద్దిగా చింతపండుని ఒక చిన్నగ్లాస్ నీళ్ళలో వేసి నానపెట్టాలి..
మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ సాల్ట్, నాలుగు పచ్చి వెల్లుల్లి రేకలు, పొట్టు తీసిన పల్లీలు, నానపెట్టిన చింతపండుని నీళ్ళతో సహా వేసి చిటికెడు పసుపుకూడా వేసి గ్రైండ్ చెయ్యాలి..
ఈ పల్లీల పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకుని పైన తాలింపు వెయ్యాలి..
రాగిసంకటిని పల్లీలపచ్చడితో తిన్నా చాలాబావుంటుంది..
Loading...
MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఎంతో కొంత సహాయం చేసి ప్రాణాలు కాపాడండి
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉన్నవారికి డేటా ఎంట్రీ వర్క్ కలదు. 2009 నుండి కచ్చితమైన పేమెంట్స్ ఇస్తున్న అత్యంత నమ్మకమైన సంస్థ. ఎటువంటి టార్గెట్స్ లేకుండా మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు.డేటా ఎంట్రీ ద్వారా నెలకి 18000 సంపాదన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
