పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే ఈ పండ్లను తినండి... వీటిని తింటూ ఉంటే మీరు బరువు తగ్గడం గ్యారెంటీ

Loading...
ఊబకాయం.. ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య. నగర యువతకు భారంగా మారిన పెద్ద సమస్య. అనవసర కొవ్వు పెరిగడం వల్ల లావుగా ఉన్నామనే మనోవేధనతో కుంగిపోతున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఎంత తినొద్దని అనుకుంటున్నా... వేపుళ్లు, బజ్జీ వంటి చిరుతిళ్లను చూడగానే నోరు కట్టేసుకోలేక వాటిని పొట్టలో పోసుకుంటున్నారు. ఆనక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఊబకాయాన్ని తగ్గించేందుకు డాక్టర్లు ఎన్నో సూచనలు చేస్తున్నారు. బరువు తగ్గడానికి, ఊబకాయం నుంచి తప్పించుకునేందుకు పండ్లను తింటే ప్రతిఫలం ఉంటుందని చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లలో ఉండే ప్రోటీన్లు లావు తగ్గడానికి ఉపకరిస్తాయనీ, వెంటనే జీర్ణం అయి.. కొవ్వు పదార్థాల రూపంలో ఉన్న వాటిని కరిగించడానికి సహకరిస్తాయంటున్నారు.కొన్ని ఫలాలు మీ పొట్ట దగ్గర కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి. అవేంటో చూడండి.
  • పైనాపిల్ మెటబాలిజంని వేగవంతం చేస్తుంది. ఇందులో కాలరీలు పెద్దగా ఉండవు. పైగా న్యూట్రింట్స్ ఎక్కువగా లభిస్తాయి. విటమిన్ సి కూడా బాగా ఉంటుంది. ఈ లక్షణాల వలన ఇది బెల్లి ఫ్యాట్ ని కరిగించేందుకు ఉపయోగపడుతుంది.
  • పుచ్చకాయ బెల్లి ఫ్యాట్ ని కరిగించటంలో మంచి ఎక్స్పర్ట్. ఇందులో 82% నీరు ఉంటుంది. దాంతో శరీరంలో అవసరానికి మించి పేరుకుపోయిన సోడియం బయటకు వచ్చేస్తుంది. కాలరీస్ కూడా పెద్దగా ఉండవు. ఇందులో కూడా విటమిన్ సి ఉండటం అదనపు లాభం.
  • బొప్పాయి రెగ్యులర్ గా తింటే మీరే ఈ ఫలం యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటారు. ఇందులో ఉండే ఎంజైమ్‌లు కొవ్వుని కరిగిస్తూ, మీ జీర్ణశక్తిని పెంచుతాయి. ఇందులో లోఫ్యాట్ కంటెంట్ ఎక్కువే.
  • రోజుకి ఒక్కటైనా తినాలి కాని, ఆపిల్ ఓ డాక్టర్ తో సమానం. ఇందులో ఫైబర్ కంటెంట్, న్యూట్రింట్స్ ఎక్కువగా ఉండటంతో జీర్ణశక్తి పెరగటం, మెటాబాలిజం వేగవంతం అవడం జరిగి, మీ కొవ్వు కూడా కరిగిపోతుంది.
  • అవోకాడో తిన్నారో లేదో కాని, ఈ ఫలంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో తెలుసుకోనే ఉంటారు. ఫైబర్ కంటెంట్ తోపాటు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ దీంట్లో. అందుకే పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడేవారు ఈ ఫలాన్ని ఆశ్రయించాలి.
  • దోసకాయ రోజు దొరకడం కష్టమేమో కాని, ఇది బెల్లి ఫ్యాట్ కరిగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. 96% వాటర్ కంటెంట్ తో ఇది ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళ్ళకుండా కంట్రోల్ చేస్తుంది.
Loading...

Popular Posts