పుట్టిన రోజు ఇలా చేస్తే మీరు కోరుకునే అదృష్టం పొందుతారు

  • బర్త్ డే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. అందుకే బర్త్ డే రోజు.. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన పనులు చేస్తారు. తమ కుటుంబ సభ్యులు కూడా.. పుట్టిన రోజు జరుపుకునే వాళ్ల కోసం ఇష్టమైన వంటకాలు, ఇష్టమైన ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. ఏడాదిలోనే అత్యంత స్పెషల్ డేగా బర్త్ డేని ప్రతి ఒక్కరూ ఫీలవుతారు.
  • సంప్రదాయం ప్రకారం తిథిని బట్టి..బర్త్ డేని జరుపుకుంటారు. కానీ ఇటీవల అందరూ.. వెస్ట్రన్ స్టైల్ ఫాలో అవుతున్నారు. అంటే మనం పుట్టిన డేట్ ని బట్టి.. బర్త్ డేట్ ని ఫిక్స్ అయిపోయి.. ఆ రోజు జరుపుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బర్త్ డే జరుపుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. బర్త్ డే రోజు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. మీకు ఆ దేవుడి నుంచి మంచి దీవెనలు అందుతాయి. అందరూ కోరుకునే ఆరోగ్యం, అదృష్టం పొందాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే నెగటివ్ ఎనర్జీని కూడా.. ఈ టిప్స్ మీ నుంచి తొలగిస్తాయి. మీరు కోరుకునే అదృష్టం పొందాలంటే బర్త్ డే రోజే చేయాల్సినవి ఏంటో చూద్దాం.. 
  • దీపం వెలిగించడం బర్త్ డే రోజు ఉదయాన్నే నిద్రలేచి.. స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగాజలం కలుపుకోవాలి. తర్వాత మీకు ఇష్టమైన దేవుడి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ దూరమవుతాయి.
  • గుడి అంతేకాకుండా దేవాలయంలో లేదా ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయం, మసీదు, చర్చి ఎవరికి నచ్చిన దగ్గర వాళ్లు దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం వల్ల నాలెడ్జ్ పొందడంతో పాటు, ఆత్మశుద్ధి అవుతుంది.
  • జుట్టు కట్ చేసుకోవడం మీ జుట్టు లేదా గోళ్లను మీ బర్త్ డే రోజు కట్ చేసుకోవడం ఏమాత్రం శుభప్రదం కాదు. ఇది మీ ఆర్థికపరిస్థితులపై దుష్ర్పభావం చూపుతుంది.
  • మాంసాహారం తమ బర్త్ డే రోజున ఎట్టిపరిస్థితుల్లో జంతువులను చంపరాదు. కాబట్టి మాంసాహారం తినకపోవడం మంచిది. ఒకవేళ బర్త్ డే రోజు మాంసాహారం తింటే.. నెగటివ్ కర్మ వెంటాడుతుంది. కాబట్టి నాన్ వెజ్ కి దూరంగా ఉండండి.
  • వివాదాలు బర్త్ డే రోజు వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమను పంచండి. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రేమను పంచడం ద్వారా మీరు హ్యాపీగా ఉంటారు. అదృష్టం పొందుతారు.
  • అన్నదానం బర్త్ డే రోజు అన్నదానం చేయండి లేదా పేదవాళ్ల అన్నం పెట్టడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది.
  • దీపం బర్త్ డే రోజు. దేవుడి ముందు దీపం వెలిగించి.. మరుసటి రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉండేలా చూడటం వల్ల.. పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)