మన పసుపు వాళ్ళకు బంగారం తో సమానం ఆశ్చర్యపోతున్నారా ? నిజం

పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు మన బామ్మలు. అందులోనూ జలుబు, దగ్గులాంటివి చేస్తే పాలల్లో పసుపు కలిపి తాగమంటారు. అయితే ఇప్పుడు ఈ డ్రింక్ కు సిడ్నీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్ కో వరకూ మంచి డిమాండ్‌ ఉందిట! ఆశ్చర్యపోతున్నారా? నిజం. పసుపు కలిపిన పాలను పశ్చిమదేశాల్లో గోల్డెన్‌ మిల్క్ గా పిలుస్తారు. ఇందులో కొబ్బరి, బాదం , జీడిపప్పు పాలను కూడా కలిపి మరింత రుచికరంగా చేస్తారు. అక్కడ దొరికే లాటెలలో టాప్‌ లిస్టులో గోల్డెన్‌ మిల్క్‌ ఉండడం విశేషం.

'పసుపు'.. పురాతన కాలం నుంచి భారతీయులు తమ వంటకాల్లో ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. అల్లం జాతికి చెందిన దుంప అయిన పసుపు మసాలా దినుసుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. పసుపులోని ఔషధ గుణాలను గుర్తించిన భారతీయ శాస్త్ర విజ్ఞానం ప్రపంచానికి దిక్సూచిలా పని చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.. పసుపు వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు భారతీయులు ఏనాడో గుర్తించారు. దీని ప్రయోజనాలను గ్రహించిన ఇతర దేశాలలోనూ పసుపుకు మరింత క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల సిడ్నీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కో వరకూ పసుపు పాలకు మంచి డిమాండ్‌ ఉంది.

వానాకాలం వచ్చిందంటే తరచుగా ఇబ్బంది పెట్టే జలుబు, చర్మ సమస్యలు, కంటి సమస్యలను పసుపుతో నివారించవచ్చు. పసుపును పాలతో కలిపి ఉపయోగిస్తే.. ఇందులోని ఔషధ గుణాలు రెట్టింపు అవుతాయని అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషధగుణాలు కలిసి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి.

పసుపు కలిపిన పాలను పశ్చిమదేశాల్లో గోల్డెన్‌ మిల్క్ గా పిలుస్తారు. దీన్నే టర్మరిక్‌ లాటె అని కూడా అంటారు. పసుపు, పాల సమ్మేళనం ఇది. ఇందులో కొబ్బరి, బాదం , జీడిపప్పు పాలను కూడా కలిపి మరింత రుచికరంగా చేస్తారు. అక్కడ దొరికే లాటెలలో టాప్‌ లిస్టులో గోల్డెన్‌ మిల్క్‌ ఉండడం విశేషం. ఈ పాల వల్ల ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు బోలెడు ఉండడంతో ఎంతోమంది వినియోగదారులు గోల్డెన్‌ మిల్క్ పట్ల ఆసక్తిని చూపుతున్నారు.

కెఫైన్‌ డ్రింక్స్ తో పోలిస్తే గోల్డెన్‌ మిల్క్‌ పూర్తిగా యాంటి ఇన్‌ ఫ్లమేటరీ డ్రింక్. పసుపు పాలలో యాంటీ మైక్రోబైల్ గుణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. అంతే కాదు శ్వాస సంబంధిత అనారోగ్యంతో పోరాడే లక్షణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండి, తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. చిన్న పసుపు ముక్కపాలతో కలిపి మరిగించినప్పుడు శరీరంలో వేడి పుట్టించి ఊపిరితిత్తుల సమస్యలు, సైనస్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, ఇది ఉబ్బసం, బ్రాంకైటిస్ ను నయం చేయడానికి ఒక సమర్థవంతమైన పరిష్కారంగా పనిచేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)