మనం రోజూ తినే కొన్ని ఆహార పదార్థాలు అత్యంత ప్రమాదకరమయినవి..ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా..?

సినిమాకు వెళ్లినా, సరదాగా పార్కుకు వెళ్లినా... షాపింగ్‌కు వెళ్లినా, ప్రయాణం చేసినా.. చివరకు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే నోరు ఆగదు కదా.. అందుకే సరదాగానో, టైమ్ పాస్ కోసమో ఇష్టం వచ్చిన వాటిని పుష్టుగా లాగించేస్తాం. అయితే ఏదిపడితే అది లాగించేస్తే మన టైమ్ దగ్గరపడినట్లే. మనం రోజూ తినే కొన్ని ఆహార పదార్థాలు మనకు ప్రాణాపాయమైనవి ఉన్నాయని తెలుసా ? వాటి వల్ల అనారోగ్యాల పాలవుతారని తెలుసా..? అత్యంత ప్రమాదకరమయిన ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా..?

సినిమా హాళ్లలో కచ్చితంగా కనిపించే స్నాక్స్ పాప్‌కార్న్. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వీటిని మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా తయారుచేస్తే వాటిని అస్సలు తినకూడదు. దీని వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదముంది. బ్రెడ్‌పై టొమాటో సాస్ వేసుకుని తింటే ఆ టేస్టే వేరు.. అని భోజన ప్రియులు అంటుంటారు. అయితే చాలావరకూ టమోటో సాస్‌ను కాకుండా వేరే వాటితో తయారు చేసి టమోటో సాస్ పేరుతో అమ్ముతున్నాయి. దాన్ని గమనించలేని వినియోగదారులు వాటినే తింటున్నారు. వీటి వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు.

శాండ్‌విచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అయితే ప్లాస్టిక్ బాక్స్‌లో పాక్ చేసిన శాండ్‌విచ్‌ను తినకుండా ఉంటేనే మంచింది. వీటిని ఎక్కువగా తినడం వల్ల లావు పెరుగుతారు. మొలకలను రోజూ తిన్నా ప్రమాదమే. అదేంటి మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యమే కదా.. అని అనుమాన పడుతున్నారా...? అవును ఆరోగ్యమే. కాకుంటే సాధారణ విధానంతో మొలకెత్తిన విత్తనాలు తింటేనే ఆరోగ్యం. బయట మార్కెట్లో సాల్మోనియా, ఈ.కోల్, లిస్టేరియా వంటి బాక్టీరియాల ద్వారా కెమికల్స్ ద్వారా విత్తనాలను మొలకెత్తిస్తున్నారు. ఇవి తింటే ప్రమాదమే కదా..

వేడివేడి పిజ్జాలను తినండి కానీ... చల్లగా ఫ్రిజ్‌లో పెట్టిన పిజ్జాల జోలికే వెళ్లవద్దు. పామాయిల్, కార్న్ ఆయిల్, చక్కెర వంటి వాటిని ఉపయోగించి తయారు చేస్తారు వీటిని. వీటిని చల్లగా తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. కోక్‌లను ఎడాపెడా తాగినా కూడా అనారోగ్యమే. వీటిలో ఉండే ఫాస్పరిక్ యాసిడ్ శరీరానికి హాని చేస్తుంది. అలాగే కృత్రిమ రంగులను కూడా ఈ కోక్‌లలో కలుపుతారు. వీటితోపాటు ఫాస్ట్‌ఫుడ్ తింటే ఫాస్ట్‌గా పోతారని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లో దొరికే ఎటువంటి ఐటమ్ అయినా సరే.. తినకుండా ఉంటే మంచింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)