ఇలా చేస్తే కరెంటు షాక్ కు గురైన వారి ప్రాణాలను తప్పకుండా కాపాడొచ్చు

  • విద్యుత్ షాక్ సమయంలో సరిగ్గా స్పందించకుంటే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం. విద్యుత్ వైరింగ్ లో లోపం, సరఫరాలో హెచ్చు తగ్గులు, ఎర్తింగ్ స‌రిగ్గా చేయ‌కున్నా, క‌రెంట్ ఎక్కువైనా, స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోయినా విద్యుత్ షాక్ కొడుతుంది. దీంతో ఆ షాక్ బారిన ప‌డ్డ‌వారు తీవ్ర గాయాల‌కు గుర‌వుతారు. ఎక్కువ సామ‌ర్థ్యం ఉన్న హై టెన్ష‌న్ విద్యుత్ అయితే క్ష‌ణాల్లోనే ప్రాణాలు పోతాయి. అయితే అంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ క‌రెంట్ కాకుండా ఓ మోస్త‌రు క‌రెంట్ షాక్‌కు గురై, అపాయంలో ఉన్న‌వారిని మ‌నం ర‌క్షించుకోవ‌చ్చు. అందుకోసం కొన్ని సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
  • క‌రెంట్ షాక్ కొట్టిన వారిని వెంట‌నే ప‌ట్టుకోకూడ‌దు. ఎందుకంటే వారిలో పెద్ద మొత్తంలో క‌రెంటు ప్ర‌వ‌హిస్తుంటుంది. ఇది వారిని ప‌ట్టుకున్న వారికి కూడా పాకేందుకు అవ‌కాశం ఉంటుంది. 
  • ఏదైనా విద్యుత్ వైర్‌ను, స్విచ్‌ను ఇంకా అలాగే ప‌ట్టుకుని షాక్‌కు గుర‌వుతూ ఉంటే వారిని ముందుగా ఆ క‌రెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. 
  • అందుకోసం అథ‌మ విద్యుత్ వాహ‌కాలు (అంటే వాటిల్లో విద్యుత్ ప్రవాహం చాలా నామినల్ గా ఉంటుంది) అయిన ఎండిపోయిన క‌ర్ర‌లు, గ్లాస్‌, ర‌బ్బ‌ర్‌, ఆస్బెస్టాస్ వంటి వ‌స్తువులను ఉపయోగించి క‌రెంట్ నుంచి బాధితుల‌ను వేరు చేయాలి.
  • క‌రెంటు షాక్ వ‌ల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న వారికి త‌క్ష‌ణ‌మే వైద్య స‌హాయం అందితే వారిని ర‌క్షించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఆంబులెన్సును పిల‌వాలి. లేదంటే వాహనంలో ద‌గ్గ‌ర్లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించాలి. దీని వ‌ల్ల క‌రెంట్ షాక్ కొట్టిన వారికి అయిన గాయాల‌కు వెంట‌నే చికిత్స ల‌భిస్తుంది. వారు ప్రాణాపాయ స్థితికి వెళ్ల‌కుండా ఉంటారు.
  • క‌రెంటు షాక్ కొట్ట‌డం వ‌ల్ల బాగా కాలిపోయి గాయాలైతే ఆ ప్ర‌దేశాల్లో చ‌ల్ల‌ని నీటితో క‌డ‌గాలి.
  • క‌రెంట్ షాక్ కొట్టిన వారు మూర్ఛ పోతుంటే వారిపై వేడిగా ఉండే బ్లాంకెట్ లేదా కోట్‌ను క‌ప్పాలి. దీంతో వారి శ‌రీర ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంది.
  • విద్యుత్ షాక్ కొట్టిన సంద‌ర్భంలో బాధిత వ్య‌క్తుల‌కు శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోతే కృత్రిమ శ్వాస‌ను నోటితో అందించాలి. ఈ క్ర‌మంలో గుండెపై రెండు చేతుల‌తో ఒత్తుతూ సీపీఆర్ కూడా చేయాలి.
  • వెన్నెముకకు బాగా గాయాలైతే త‌ల‌, మెడ‌ల‌ను క‌ద‌ప‌కుండా ఉండేలా చూసుకోవాలి. దీంతో న‌ష్టాన్ని కొద్దిగా నివారించ‌వ‌చ్చు.
  • షాక్ కొట్ట‌డం వ‌ల్ల గాయాలై ర‌క్త‌స్రావం జ‌రుగుతుంటే శుభ్రమైన గుడ్డ‌తో గాయాల‌కు క‌ట్టు క‌ట్టాలి. దీంతో బ్లీడింగ్ ఆగుతుంది.

Popular Posts

Latest Posts