ఈ ఐదు విషయాల్లో పర్‌ఫెక్ట్‌గా ఉంటే భార్య దృష్టిలో హీరో అవుతారు

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు. కానీ చాలామంది భార్యాభర్తలు చిన్నచిన్న మనస్పర్థలతో వారి దాంపత్యాన్ని నరకంగా మార్చుకుంటున్నారు. ఏ బంధానికైనా నమ్మకం ఒక అవసరం. కానీ దాంపత్య బంధానికి నమ్మకమే పునాది. చాలా జంటలు ఒకరిపై ఒకరు బయటకు అపార నమ్మకంతో ఉన్నట్టు కనిపించినా... లోలోపల మాత్రం అనుమానంతో రగిలిపోతుంటారు. మగవారిలో ఈ బుద్ధి మరీ ఎక్కువని తాజాగా చేసిన ఓ సర్వేలో వెల్లడైంది. మగాళ్లు ఈ అనుమానం అనే పెనుభూతం నుంచి బయటపడటానికి ముఖ్యంగా ఐదు విషయాలు తెలుసుకోవాలి. ఆ ఐదు విషయాల్లో మీరు పర్‌ఫెక్ట్‌గా ఉంటే మీ భార్య దగ్గర మీరే హీరో.

చాలామంది భర్తలకు ప్రధాన సమస్య తొందరపాటుతనం. భార్య చెప్పే విషయాన్ని పూర్తిగా తలకెక్కించుకోకుండా వారి పంథాలో వారు వెళుతుంటారు. దీనివల్ల కొన్ని రోజులకు ఇద్దరి మధ్య మాటలే కరువవుతాయి. అందువల్ల భార్య చెప్పిన విషయాన్ని పూర్తిగా వినాలి. ఆమె చెప్పిన విషయాల్లో ఏవైనా అభ్యంతరాలుంటే సర్దిచెప్పేందుకు ప్రయత్నించాలి.

రెండోది ఆడవాళ్లకు ఆభరణాలంటే ఇష్టం. వాటితో పాటు కొన్ని విషయాలు తమ దాంపత్యంలో తీపి గురుతులుగా మిగిల్చుకోవాలని వారు భావిస్తారు. ఏ పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో ఒక గిఫ్ట్ ఇస్తే వారు దాన్ని దాచుకుని అపురూపంగా చూసుకుంటారు. ఇల్లాలన్నాక పిల్లలు, పని ఒత్తిడి సహజం. అలాంటి సమయంలో కొద్దిసేపు విశ్రాంతి కావాలని వారు కోరుకుంటారు. దాన్ని చెడగొట్టేందుకు మాత్రం ప్రయత్నించొద్దు. భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ గొడవలవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఎవరో ఒకరు తగ్గి ఉండాలి. ఇద్దరూ రెచ్చిపోతే అది కలహాల కాపురమవుతుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే అన్ని విషయాలు అవగతమవుతాయి. ఈ విషయాలు పాటిస్తే ఆ కాపురం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)