ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగుతున్నారా ? అసలు కాఫీ ఏ సమయంలో తాగితే మంచిది ?

ఉదయం లేచి ముఖం కడుక్కోగానే ఒక కప్పు వేడి కాఫీ గొంతులో పడందే చాలామంది రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించరు. అయితే.. ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం మంచిది కాదని ఇటీవల నిర్వహించిన ఒక పరిశోదనలో తేలింది. నిద్ర లేవగానే శరీరంలో కార్డిసాల్‌ ఎక్కువగా విడుదలవుతుందని, అలాంటి సమయంలో కాఫీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అయిన తర్వాత కాఫీ తాగాలని వారు సూచిస్తు న్నారు. అంతేకాకుండా వారు కాఫీ ఎప్పుడు ఏ సమయంలో తాగితే మంచిదో కూడా తెలియజేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మద్య, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల లోపు తాగితే మంచి ఫలితాన్ని పొందొచ్చని వారు సూచిస్తున్నారు.

Popular Posts

Latest Posts