మినరల్ వాటర్ బాటిల్ నీరు తాగుతున్నారా?.. అయితే తప్పకుండా ఇది ఒక సారి చదవండి

Loading...
మాములుగా బయటకి వెళ్ళినప్పుడు దాహం వేస్తే మనం దగ్గరలో ఉన్న షాప్ లో వాటర్ ప్యాకెట్ గాని, వాటర్ బాటిల్ గాని కొని దాహాన్ని తీర్చుకుంటాం. కాని అలా తాగడం మంచిది కాదు, మీ ఆరోగ్యానికి ముప్పు, ఇక ముందట అలా ఆ నీరు తాగడం మానేయండి అని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. బయట మనకు లభ్యమయ్యే మినరల్ వాటర్ బాటిళ్ళలో కొలీఫాం బాక్టీరియా ఉంటున్నట్లు ఆ సంస్థ తమ రీసెర్చీ లో కనుక్కోంది.

వీరు ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 15 నుండి 20 రకాల వాటర్ బాటిల్లను ‘ఘజియాబాద్నేషనల్ టెస్ట్ హౌస్’ లో నిర్వహించిన పరీక్షల్లో బాటిళ్లలో ఈ వైరస్ ఉన్నట్లుకనుగొన్నారు. ఈ విషయంపై స్పందించిన ‘ఇండియన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ’అనుమతులు లేకుండా నడుపుతున్న కంపెనీలపై చర్యలకు సిద్ధమవుతోంది. ఈవిషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? అసలు తనిఖీలునిర్వహించారా? నిర్వహిస్తే వాటి సమాచారన్ని తమకు అందించాలని బీఐఎస్ఆదేశించింది. గతేడాది ప్రభుత్వం 6,513 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలకు లైసెన్స్లు జారీ చేసాయి. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ 1,500 కోట్లకుపైగా చేరింది.
Loading...

Popular Posts