ఉదయం బయటకు వెళ్లేటప్పుడు టిఫిన్ లా ఇలాంటి ఆహారాన్ని తింటే బోలెడంత ఆరోగ్యం

ఉదయం లేవగానే ఎక్కువగా ఆకలి అవుతుంది. ఏదో అల్పాహారం తీసుకున్నాం అనుకుంటే సరిపోదు. ఉదయం బయటకు వెళ్లేటప్పుడు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని కడుపునిండా తినడానికి ప్రాధాన్యమిస్తే మంచిది.
  • గోధుమలతో చేసిన ఏ పదార్థమైనా ఉదయం పూట తింటే మచింది. వీటిల్లో విటమిన్‌ 'ఇ' పోలెట్‌ అధికంగా లభిస్తుంది. వీటి వల్ల హిమోగ్లోబిన్‌ శాతం వృద్ధి చెందుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది. తొందరగా అలసిపోవడం ఉండదు. 
  • మార్కెట్‌లో తృణ ధాన్యాలతో చేసిన బ్రెడ్‌ అందుబాటులో ఉంటుంది. దాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. బ్రెడ్‌ నుంచి ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలూ, పీచూ, పొటాషియం లభిస్తాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి.
  • ఉదయం పూట ఉడికించిన గుడ్డు తీసుకుంటే చాలా మచింది. పొద్దున్నే తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సరిపడేంత శక్తి లభిస్తుంది. జీవక్రియల రేటు కూడా వృద్ధి చెందుతుంది. మధ్యాహ్నం భోజనం వరకూ ఆకలి వేయదు. గ్రీన్‌ టీ తాగి బయటకు వెళ్లడం వల్ల శరీరాంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
  • పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. ఎండలోకి వెళ్లినా అలసట ఉండదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)