మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చెయ్యండి ఈజీగా దొరికేస్తుంది

మీ ఫోన్ పోయిందా.. మీ ఫోన్ ఎక్కడ ఉన్న ఈజీగా కనిపెట్టేయచ్చు.. ఎలానో మీరే చూడండి.. మీ ఫోన్‌లో గతంలో రిజిస్టర్‌ చేసుకున్న గూగుల్‌(జీమెయిల్‌) అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వండి. గూగుల్‌ సెర్చ్‌ హోం పేజీకి వెళ్లి ‘వేర్‌ ఈజ్‌ మై ఫోన్‌?’ అని టైప్‌ చేస్తే, గూగుల్‌ మ్యాపుపై బాక్స్‌ కనిపిస్తుంది. బాక్స్‌లో ‘లొకేట్‌ ఫోన్‌’ ఆప్షన్‌ను ఒకే చెయ్యండి. మ్యాపుపై మీ ఫోన్‌ ఉన్న లొకేషన్‌ చూపిస్తుంది. ‘రింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా పూర్తి వాల్యూమ్‌తో 5 నిమిషాలు మోగుతుంది.

బాక్స్‌లోని ‘ఎనేబుల్‌ లాక్‌ అండ్‌ ఎరేజ్‌’ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త పాస్‌వర్డ్‌ కూడా పెట్టుకోవచ్చు. ‘దయచేసి ఈ ఫోన్‌ను ఫలానా చోట తిరిగి ఇచ్చేయండి.. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి.. అంటూ పోయిన ఫోన్‌ లాక్‌ స్ర్కీన్‌పై కనిపించేలా మెసేజ్‌, కొత్త ఫోన్‌ నెంబర్‌నూ పంపొచ్చు. ఆ సౌకర్యం కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్లను మాత్రమే..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)