మీ శరీరం గురించి మీకు తెలియని నిజాలు అద్భుతాలు. ఇది సైన్స్ అద్భుతమా దేవుని అద్భుతమో మీరే చెప్పండి

Loading...
మానవ శరీరం దైవసృష్టి.. అది ఎవరికీ అర్థం కాదు... అని కొందరు. కాదు అది సైన్స్... కొన్ని పరమాణువుల కలయిక వల్ల ఉద్భవించిన అరుదైన జీవి అని మరి కొందరు. ఎంతగా చర్చించుకున్నా ఎడతెగని అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి మానవ శరీరంలో. అవి కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే అద్భుతాల నిలయమైన వ్యక్తికి కూడా తెలియనంతగా. ఈ అద్భుతాల్లో కొన్నింటిని పుస్తకాల ద్వారా చదువుకునే ఉంటారు. మరి కొన్నింటిని శాస్త్రవేత్తల అవిశ్రాంత పరిశోశనల్లో వెలుగులోకి తెచ్చారు. ఆ అరుదైన మానవ అద్భుతాలేంటో చూద్దామా..?

1. ఉక్కపోతగా ఉంటే చెమట పట్టడం సహజమే. అది వాసన రావడం కూడా అత్యంత సహజం. అయితే ఆ వాసనకు, చెమటకు సంబంధం ఉండదని ఎంతమందికి తెలుసు. చర్మంపైన బాక్టీరియా విడుదల చేసే వ్యర్థాలు చెమటతో కలవడం వల్ల ఈ వాసన వస్తుంది.

2. మెదడు ముడతలుముడతలుగా ఉన్న ఓ అవయవం వంటిది. ఆ ముడతలను తొలగిస్తే అది ఓ దిండు సైజులో ఉంటుంది.

3. అనారోగ్య కారణాల వల్ల కాలేయాన్ని కొంత తొలగించాల్సి వచ్చిన ఏ బాధ లేదు. ఎందుకంటే అది మళ్లీ పెరుగుతుంది. ఎంతగా అంటే మనిషి శరీరానికి అవసరమయినంత మేరకు దానికదే పెరిగి ఆగిపోతుంది. ఇలా ఎన్ని సార్లు తొలగించినా పెరుగుతూనే ఉండటం వింతేకదా మరి.

4. గోళ్లను, వెంట్రుకలను కత్తిరించినా నొప్పి పుట్టదు. కారణం ఆ రెండింటిలోనూ కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.

5. ప్రపంచంలోని 10శాతం పురుషులు, 8శాతం స్త్రీలు ఎడమ చేతివాటం కలిగి ఉంటారు.

6. ఎక్కువగా శ్రమపడే వ్యక్తి నుంచి ప్రతీరోజూ 4 గ్యాలన్ల చెమట విడుదలవుతుంది. ఒక గ్యాలన్ 3.7 లీటర్లకు సమానం. ఈ లెక్కన ప్రతీరోజూ సుమారు 15 లీటర్ల చెమట ఓ కష్టజీవి నుంచి విడుదలవుతుంది.

7. మానవ శరీరంలో సుమారు 5 లక్షల టచ్ డిటెక్టర్స్ ఉంటాయి. అందుకే ముట్టుకున్న వెంటనే తెలిసిపోంతుంది.

8. నిద్ర కరువయినా మనిషి చనిపోతారు. కాకుంటే దీనికి కనీసం వారం పదిరోజులు పడుతుంది.
Loading...

Popular Posts