వేయించిన కూరలు (Fry ఫుడ్స్) ఆహారపదార్ధాలు తీసుకుంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్

పూర్వకాలపు ఆహార అలవాట్లతో పోలిస్తే.. ప్రస్తుతం వాటిలో గణనీయమైన మార్పు వచ్చింది. రోజురోజుకీ ప్రజలు తమ ఫుడ్ హ్యాబిట్స్ ను మార్చేసుకుంటున్నారు. ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ప్రస్తుతం అందరూ ఫ్రైడ్ ఫుడ్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. అలానే బటర్,చీజ్ తో చేసిన వంటకాలను లొట్టలేసుకుంటూ మరీ తినేస్తుంటారు. ఇక పై ఇలాంటి ఆహార పదార్ధాల విషయంలో జాగ్రత్త పడాల్సిందేనని ఇటలీకి చెందిన నేపుల్స్ ఫెడ్రికో యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటున్నారు. ఫ్రైడ్ ఫుడ్ ని అధికంగా తీసుకుంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్ ఉంటుందని వెల్లడించారు. అలాంటి ఆహారపదార్ధాలు తీసుకునే వారిలో.. ఆ సమస్యతో పాటు ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉందని స్పష్టం చేశారు. 
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)