మందు, బీర్ కంటే బిర్యానీయే యమ డేంజర్ అంటున్న డాక్టర్స్

పుట్టిన రోజు వేడుకలయినా, పెళ్లి రిసెప్షన్ అయినా చికెన్ బిర్యానీ ముద్ద లేనిదే నోటితో పాటు మనసు సంతృప్తి పడదనుకునే వారికి షాకింగ్ న్యూస్. తమకు మద్యం తాగే అలవాటు లేదు.. కేవలం బిర్యానీ మాత్రమే ఇష్టంగా లాగించేస్తాం అనుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలు అతిగా చికెన్, మటన్ బిర్యానీలు లాగించేసినా వస్తాయి. బిర్యానీతో పాటు తీసుకునే కూల్ డ్రింక్‌ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత ఎక్కువవుతాయని ఓ పరిశోధనలో తెలిశాయి.
కాలేయ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ప్రతీ యేడాది 30 నుంచి 35 శాతం పెరుగుతోంది. నగరాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. వారం వారం క్రమం తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలతో బాధితులు ఎక్కువగా ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారని పరిశోధనలో తేలింది. బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వాడటం, కొన్ని రెస్టారెంట్లలో క్వాలిటీ లేని మాంసాన్ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్క బిర్యానీని తింటే సుమారు 500 కేలరీలు చేరతాయని, అంత భారీ మొత్తంలో కేలరీలు మనిషికి ఒకే సారి అవసరం లేదని చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)