బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రమే లివర్ ని పాడుచేస్తాయి అనుకుంటారు కానీ మనం రోజూ తీసుకునే ఈ ఆహార పదార్థాల వల్ల కూడా లివర్ దారుణంగా దెబ్బ తింటుంది.

మనిషి జీవితంలో ఎంత సంపాదించినా దాన్ని అనుభవించేందుకు సరైన ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం లేని సమయంలో ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం లేదు. అందుకే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. ఏదైనా అతిగా తినడం లేదా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. అతిగా మద్యం సేవించడం మరియు ధుమపానం కాలేయాన్ని దెబ్బ తీస్తుందని అనే విషయం తెల్సిందే. ఇక తాజాగా తేలిన విషయం ఏంటి అంటే మనం రోజూ తీసుకునే పదార్థాల వల్ల కూడా కాలేయం దెబ్బ తింటుంది.
  • చక్కెర లేదా తీపి పదార్ధాలు అదికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తినడం వల్ల శరీరం వినియోగించుకోగా మిగిలిన చక్కెర కాలేయంలో కొవ్వుగా నిల్వ ఉండి పోతుంది. దాంతో కొంత కాలంకు కాలేయం చెడి పోవడం జరుగుతుంది. 
  • ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాలు రుచిగా ఉండేందుకు మోనోసోడియం గ్లుటమేట్‌ను వాడుతున్నారు. దీని పరిమాణం అధికం అయినా కూడా కాలేయ సంబంధిత వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయి. 
  • కంటి చూపు బాగుండాలి అంటే విటమిన్‌ A తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విటమిన్‌ A అనేదాన్ని ఎక్కువగా తీసుకున్నా కూడా కాలేయంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం త్వరగా చెడి పోతుంది. కూల్‌ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. 
  • ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పువల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెల్సిందే.
  • చిప్స్‌ వంటివి అధికంగా తిన్నా కూడా కాలేయంకు డేంజర్‌. 
అందుకే ప్రతి రోజు తీసుకునే ఆహారంలో వీటిని తగ్గించుకోవడం చాలా మంచిది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)