గాలి కూడా కొనుక్కునే రోజులు వచ్చేసాయి. డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు

Loading...
మన రాజధాని ఢిల్లీ లో పెరిగిపోతున్న వాయుకాలుష్యాన్ని ఒక కెనడియన్ కంపెనీ సొమ్ము చేసుకునే ప్లాన్ చేసింది. స్వచ్ఛమైన గాలిని డబ్బాల్లో ప్యాక్ చేసి ఢిల్లీలో అమ్మబోతోంది. వైటలిటి ఎయిర్ అనే బ్రాండ్ నేమ్ తో ఈ స్వచ్ఛమైన గాలి ఢిల్లీ వాసులకి అందనుంది.

నీళ్ళు కొనుక్కునే రోజులొస్తాయి అంటే ఒకప్పుడు మనం నమ్మలేదు? కాని ఇప్పుడు, నీళ్ళు కొనకుండా ఇల్లు గడిచే పరిస్థితే లేదు. ఇప్పుడు గాలి వంతు వచ్చింది. పెరుగుతున్న కాలుష్యం తో ఊపిరి పీల్చితే ఊసురుతీసే జబ్బులు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. ఒక్క మనదేశం లోనే కాదు, చైనా, కెనడాలలో కూడా ఇలాంటి గాలి అమ్మకాలు మొదలయ్యాయి. పర్వత ప్రాంతాల్లో దొరికే స్వచ్ఛమైన గాలిని డబ్బాల్లో బంధించి అమ్ముకోవాలనే ఆలోచన ఈ కెనడా కంపెనీకి ఎలా వచ్చింది అంటే..?

గత ఏడాది వేసవి కాలం లో కెనడాలో కల్గరి సిటీ కి దగ్గరలోని అటవీ ప్రాతాలలో అగ్గి రాజుకుని అడవులు తగలబడ్డాయి. గాలి బాగా కాలుష్యం అయిపోయింది. నగర ప్రజలకి శ్వాస పీల్చుకోవడం కష్టమయింది. అప్పుడు ఈ కంపెనీ కెనడా లోని పర్వత ప్రాంతాల్లో దొరికే స్వచ్ఛమైన గాలిని డబ్బాల్లో అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఢిల్లీ లో కూడా కాలుష్యం బాగా పెరుగుతుండటంతో తమ గాలిని ఇక్కడ కూడా అమ్మడం మొదలు పెట్టినీ కెనడా కంపెనీ. 3 లీటర్ల స్వచ్చమైన గాలి ధర 1050 ఉంటె, 8 లీటర్ల డబ్బా ధర 1230 ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ లో 500 డబ్బాలని శాంపిల్ గా అమ్మారు. చైనాలో అయితే, గర్భిణులు, కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్స్, పరీక్షలకి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఈ డబ్బా గాలి కొనుక్కుని పీలుస్తున్నారట.

చెట్లు పెంచండి, వాహనాలని తక్కువగా ఉపయోగించండి, తక్కువ దూరాలు అయితే సైకిల్ పై వెళ్ళండి అని చిలక్కి చెప్పినట్లు చెప్పినా మనం వినలేదు. విచ్చలవిడిగా చెట్లు కొట్టేసి, కాంక్రీట్ జంగిల్ గా మన నగరాలని మనం కాంక్రీట్ జంగిల్స్ గా మార్చుకుని గాలి కొనుక్కునే దుస్థితికి చేరాం.
Loading...

Popular Posts