కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యమైన జుట్టు, ఒత్తుగా ఉన్న జుట్టు మీ సొంతం

 • హార్మోన్ల మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల జుట్టు సమస్యలు ఏర్పడుతున్నాయి. నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనే ఆత్రుతతో అమ్మాయిలు ఎక్కువగా డైటింగ్‌ చేస్తుండటమూ దీనికి ప్రధాన కారణం. దానివల్ల ఏర్పడిన మెగ్నీషియం, విటమిన్‌ బి12, బి3, డి3 లోపం జుట్టు రాలటానికి కారణం అవుతోంది.
 • వంశపారంపర్యంగా గాని, వ్యాధులవల్లగాని, తీసుకునే మందుల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు సమస్యలను పరిష్కరించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. 
 • తలను, జుట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల చుండ్రుతో పాటు అనేక రోగ కారకాలు తొలగిపోతాయి. ఇంకా జుట్టు ఊడిపోవటం కూడా తగ్గుతుంది. దాంతో ఒత్తుగా ఉన్న జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.
 • సరైన పోషకాలు తీసుకోవటం:
 • ఆరోగ్యమైన జుట్టు కావాలంటే సమతుల్యమైన ప్రోటిన్స్‌ తీసుకోవాలి. ఉదా: జింక్‌, బయోటిన్‌, విటమిన్స్‌, సి, ఎ, ఇ, ఐరన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, ఎస్సెన్సియల్‌ ఆయిల్స్‌ లాంటివి శరీరంలోని పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేస్తాయి.అయితే ఇవి ఏయే ఆహారపదార్థాల్లో దొరుకుతాయో తెలుసుకుందాం.
 • జింక్‌: నట్స్‌, డ్రైసీడ్స్‌, సన్‌ప్లవర్‌ సీడ్స్‌, గోగునార విత్తనాలు, నువ్వులు, దేవదారు వృక్షపు గింజలను తినటం వల్ల జింక్‌ ఎక్కువగా లభిస్తుంది.
 • ఐరన్‌: రక్తహీనత వల్ల కూడా జుట్టు రాలుతుంది. బచ్చలికూర, ఆకు కూరల్లో ఎక్కువగా ఐరన్‌ లభిస్తూంది.
 • విటమిన్స్‌: విటమిన్‌ ఎ, బి, సి, క్యారెట్స్‌, మిరియాల్లో దొరుకుతాయి. వీటిని జ్యూస్‌లుగా గాని, సలాడ్స్‌లో గాని కలిపి తీసుకోవాలి. ద్రాక్ష గింజలు, గ్రీన్‌ టీలో విటమిన్‌ 'ఇ' ఎక్కువగా లభిస్తుంది. ఇది జుట్టు రాలటాన్ని నియంత్రిస్తుంది.
 • ఒమోగా-3 ఫ్యాట్‌ : గోగునార గింజల్లో, వాల్‌ నట్స్‌లో, గుమ్మడికాయ గింజల్లో లభిస్తుంది. ఇవి తీసుకోవటం వల్ల కూడా జుట్టు రాలటం తగ్గుతుంది.
 • బయోటిన్‌: గుడ్లు, బఠాణీ, సోయాబిన్స్‌లో అన్ని రకాల పప్పుగింజల్లో బయోటిన్‌ ఉంటుంది.
 • ప్రోటిన్స్‌: ప్రోటిన్స్‌ చేప, నట్స్‌, సోయాబీన్స్‌, చిక్కుడు జాతుల్లో ఎక్కువగా ఉంటాయి.
 • తడి జుట్టును దువ్వొద్దు:
 • తడి జుట్టును దువ్వటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి అలా చేయకూడదు. 
 • వెడల్పు పళ్ల దువ్వెనతోనే దువ్వుకోవాలి. ఎక్కువసార్లు దువ్వటం వల్ల జుట్టు చిట్లిపోయి రాలిపోతుంది.
 • వారానికోసారి తలకు నూనెను పెట్టాలి. నవరత్న, బాదాం, ఆముదం తలకు పట్టించి బాగా మర్దన చేయటం వల్ల జుట్టు రాలటాన్ని నివారించవచ్చు. 
 • మందార పువ్వుల పేస్టును, కొబ్బరి నూనెలో కలుపుకొని పెట్టుకోవాలి. 
 • నిమ్మకాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించాలి.
 • ఎక్కువగా నీటిని తాగాలి. మునివేళ్ల గోళ్లనూ 10-20 నిమిషాల పాటు (నెయిల్‌ రబ్బింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి.
 • ఎక్కువసేపు నిద్ర పోవాలి. కాటన్‌ టవల్‌ని మత్రమే వాడాలి.
 • ఒత్తెన జుట్టు పొందటానికి. ఉసిరి, కుంకుడును వాడాలి.
 • ఉసిరి, కుంకుడు, గుడ్లను హెయిర్‌ ప్యాక్‌గా వాడుకోవచ్చు.
 • వేపాకులు కలిపిన నీళ్లను వాడాలి, ఇవి మంచి యాంటిబయాటిక్‌గా పనిచేస్తాయి.
 • అరటి, అలోవిరాజెల్‌, నూరిన మెంతులను తలకు పట్టించటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)