ముఖం పై జిడ్డు, మురికిని పోగెట్టి అందంగా కనపడడానికి అలోవెరా (కలబంద) బాగా ఉపయోగపడుతుంది

సాధారణంగా ముఖంపై మురికి, జిడ్డు పేరుకుంటే మొటిమల వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మొటిమలకు కారణం అయిన మురికిని తొలగించుకోవడానికి మనకు సులభంగా అందుబాటులో ఉండే కలబంద సహాయపడుతుంది. అంతేకాక అనేక చర్మ సమస్యల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది.
  • కలబంద గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
  • కలబంద ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకులను పేస్ట్ చేసి కొన్ని చుక్కల తేనే కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే జిడ్డు, మురికి తొలగిపోతాయి. 
  • ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద గుజ్జు, అర స్పూన్ పెరుగు, అర స్పూన్ కీరదోస రసం, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మీద మురికి పోవటమే కాకుండా అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి. 
  • ఒక బౌల్ లో రెండు స్పూన్ల కలబంద గుజ్జు, ఒక స్పూన్ ఓట్స్, ఒక స్పూన్ కీరదోస తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వలయాకారంలో మసాజ్ చేయాలి.

Popular Posts

Latest Posts