మోకాళ్ళలో గుజ్జు అరిగిపోకుండా చింతగింజలతో అద్భుతమైన మార్గం

ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసు వారికీ కూడా కీళ్లు, ఎముకల అరుగుదల కామన్ అయిపోయింది. దీంతో కీళ్లు, ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందనే పేరిట లక్షల రూపాయలు ఖర్చుచేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చెప్పే ఈ ఒక్క మిశ్రమం తయారుచేసుకుని 30 రోజుల పాటు క్రమం తప్పక వాడితే కీళ్లు, ఎముకలు దృఢంగా ఉక్కులాగా తయారవుతాయి. గుజ్జు అరిగిపోయిన వారికి తిరిగి మళ్లీ ఏర్పడుతుంది. ప్రారంభ దశలో ఉన్నవారికి, ఎటువంటి సమస్య లేనివారికి భవిష్యత్ లో ఆ సమస్య ఏర్పడదు. 

తయారీ విధానం:
  • ముందు చింతపండు గింజలు బాగా వేయించాలి. తరువాత ఆ గింజల్ని నీటిలో రెండు రోజులు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత వాటిని పిసికి పై తోలు తీసి పప్పును ఎండబెట్టాలి.
  • బాగా ఎండిన చింతగింజల్ని మెత్తగా దంచి పొడిచేసుకొని ఒక సీసాలో భద్రపర్చుకోవాలి.
  • ఈ పొడి ఒక చెంచా, ఒక గ్లాస్ నీరు పోసి ఉడికించాలి తరువాత పాలుపోసి, చక్కెర వేసి పాయసంలా చేసుకొని ఉదయం, సాయంత్రం సేవించాలి.
  • ఈ విధంగా కొద్ది కాలం పాటు చేస్తుంటే కీళ్లు, మోకాళ్లలో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడి యదా స్థితికి చేరుతాయి. ఇది పెద్దగా ఖర్చు లేని కష్టం లేని సులభ మార్గం. ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్, కీళ్ళలో రాడ్లు పెట్టించుకొని తరువాత బాధపడే ప్రమాదం తప్పుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)