మీరు ఏ టైం లో పుట్టారు ? ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా ? ఏ టైం లో పుడితే ఎలా ఉంటుందో చెప్పే విశేషాలు

 • భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పుట్టిన సమయం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి జాతకం తెలపడానికి వాళ్లు పుట్టిన ఖచ్చితమైన తేదీ, సమయం, రోజు, గంటలు నిమిషాలు, చాలా ముఖ్యం. ఆఖరికి ఒక నిమిషం తేడా ఉన్నా.. వాళ్ల కుండలి చార్ట్ లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి పుట్టిన సమయం చాలా కీలకం.
 • ఉదయం 4 నుంచి 6 గంటల మధ్యలో పుట్టిన వాళ్లు అరుదుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని.. ఇతరుల అసూయ వల్ల కోల్పోతారు. కష్టానికి తగ్గ ఫలితం మీరు భుజానికి వేసుకున్న పనుల్లో పురోగతి సాధించడానికి పట్టుదల కలిగి ఉంటారు. ధృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. మీ భవిష్యత్ చాలా బ్రైట్ గా ఉంటుంది. మీకు కావాల్సినవి నెమ్మదిగా చేరుతాయి. కానీ.. మీ కష్టానికి తగ్గట్టు.. మీరు కోరుకున్నది మీ వాకిలి ముందుకు వస్తాయి.
 • ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య పుట్టినవాళ్ల జీవితంలో చాలా రహస్యమైన కార్యాలు జరుగుతాయి. మీరు లైఫ్ లో కొంచెమే ఎక్స్ పెక్ట్ చేస్తే.. మీరు ఊహించని రీతిలో పొందుతారు. మీ మనసు అన్ని సమయాల్లో చాలా ప్రశాంతంగా ఉండాలి. స్ట్రిక్ట్ గా, యాక్టివ్ గా లైఫ్ స్టైల్ ఉండేలా జాగ్రత్త పడాలి. దూపరదిండిలా వ్యవహరిస్తే.. అపాయంలో పడిపోతారు. కాబట్టి.. సరిగ్గా ఇన్వెస్ట్ చేసి.. రాబడి రాబట్టుకోవాలి.
 • ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య మీ ఫ్రెండ్స్ ని, రిలేషన్ షిప్స్ ని కొనసాగించడానికి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. మీ జీవితంలో డబ్బు చాలా కీలకపాత్ర పోషిస్తుంది అలాగే మీరు కోరుకున్నది, మీరు అనుకున్నది సాధించలేకపోయినా, పొందలేకపోయినా.. నిరాశ, మనోవైఫల్యానికి లోనయ్యే అవకాశాలుంటాయి.
 • ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య పుట్టినవాళ్లు అంటే మధ్యాహ్నానికి ముందు పుట్టినవాళ్లు కుండలినిలో బలమైన స్థానాన్ని సంపాదిస్తారు. ప్రతి విషయంలోనూ వీళ్లు సక్సెస్ సాధిస్తారు. అత్యంత సక్సెస్ ఫుల్ జీవితాన్ని వీళ్లు ఎంజాయ్ చేయగలుగుతారు. అయితే.. చేతుల్లో ఉన్న పవర్ దుర్వినియోగం చేసుకుంటే.. అత్యంత పెద్ద సమస్యలో చిక్కుకుంటారు.
 • 12 నుంచి 2 గంటల మధ్య పుట్టిన వాళ్ల భవిష్యత్.. ట్రావెలింగ్ తో ముడిపడి ఉంటుంది. అది వ్యక్తిగతంగా లేదా ఉద్యోగ రిత్యా లేదా రెండింటి కారణంగా అయి ఉండవచ్చు. వీళ్లు చాలా అందంగా, షార్ప్ మైండ్ కలిగి ఉంటారు. వాళ్ల జాలి, దయ కారణంగా.. అందరూ గౌరవిస్తారు. వాళ్ల జీవితంలో చాలా పాపులర్ అవుతారు. గమ్యం చేరడానికి గొప్ప రోడ్ ఉంది. అలాగే.. ఎలాంటి నిరోధకాలు లేకుండా.. నడవవచ్చు. మీరు గౌవరించబడతారు, అలాగే ప్రేమించబడతారు. కాబట్టి.. మీ భవిష్యత్ చాలా బావుంటుంది.
 • మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో ఈ సమయంలో పుట్టినవాళ్లు డబ్బుతో ముడిపడి ఉన్న జాబ్స్ అంటే అకౌంటింగ్, గవర్నమెంట్ ఫండ్ స్కీమ్స్, బ్యాంక్ జాబ్స్, నిజాయితీ, నమ్మకానికి మారుపేరైన ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. శాసించే లెవెల్ లో ఉంటారు. అయితే వీళ్ల సెక్స్ లైఫ్ పై దుష్ర్పభావం ఉంటుంది. యాక్సిడెంట్స్ మీ జీవితంపై ప్రభావం చూపవచ్చు. ఒక స్టేజ్ లో లీగల్ ప్రొసీడింగ్స్ లోనూ సమస్యలు ఎదుర్కోవచ్చు.
 • సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యలో జన్మించిన వాళ్లు జీవితంలో చాలా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే.. మంచి విలువ, ప్రాధాన్యత ఉంటుంది. ఇతరులతో పోల్చితే.. పెళ్లి తర్వాత మీ జీవితంపై చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి.. వెనకడుగు వేయకుండా.. మరింత కష్టపడటం చాలా అవసరం. లీగల్ మ్యాటర్స్ ఇతరులతో మాట్లాడటం, కమ్యునికేట్ అయ్యే జాబ్ లో ఉంటారు. అలాగే.. శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. లీగల్ మ్యాటర్స్ లో తలదూర్చకుండా ఉండటం చాలా అవసరం. లేదంటే.. డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
 • సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో పుట్టిన వాళ్లు.. మీరు క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్లతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీ మీకు రెండో ప్రియారిటీ. సామాజిక జీవితం మీ లైఫ్ లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. కష్టపడి పనిచేస్తారు మీరు సామాజిక సేవలు, ఆరోగ్య సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కష్టపడి పనిచేసే తత్వం మీకు జీవితంలో ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. మంచి గుర్తింపు, సంపద, విజయం పొందగలుగుతారు.
 • రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఈ సమయంలో పుట్టిన వాళ్లు.. క్రియేటివ్ టాలెంట్, స్కిల్స్ ఉంటాయి. మీ వ్యక్తిత్వం ఆశావాదంగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఇష్టపడే.. అభిమానించే ఫీల్డ్ లో ఉద్యోగం సంపాదిస్తారు. సక్సెస్ మీరు గుర్తింపు, విజయం సాధిస్తారు. కానీ.. మీ మంచి కోరే వాళ్ల సలహాలను సమయానికి నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల పరిణామాలు కాస్త విభిన్నంగా మారతాయి.
 • రాత్రి 10 నుంచి 12 మధ్య రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య జన్మించినవాళ్లు సంపద, ఆస్తి.. పొందడం కాస్త కష్టంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో రాణిస్తారు. ఇది.. మిమ్మల్ని కాస్త ధనవంతుల్ని చేయవచ్చు. మీ జీవితంలో కష్టనష్టాలు, సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తాయి. దానికి ఎవరూ బాధ్యులు కారు.
 • రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య అర్థరాత్రి తర్వాత మీరు పుట్టినట్టైతే.. చాలా తెలివైన, సాహసం చేయాలనే తపన, ట్రావెంలింగ్ పై ఆసక్తి కలిగినవాళ్లు అయి ఉంటారు. మీరు మీడియా రిలేటెడ్ జాబ్స్ లో సెటిల్ అయ్యే అవకాశాలుంటాయి. సామాజిక జీవితం మీ వ్యక్తిత్వంపై మీ బంధువులు, చుట్టుపక్కల వాళ్లపై ప్రభావం ఉంటుంది. వాళ్లు.. అదే ఫాలో అవ్వాలని భావిస్తారు. కాబట్టి.. జాగ్రత్తగా ఉండండి. మీరు గొప్ప సామాజిక జీవితాన్ని అనుభవిస్తారు
 • రాత్రి 2 నుండి 4 గంటల మధ్య ఈ సమయంలో జన్మించిన వాళ్లు.. ఫుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు. లేదా కుకింగ్, ఫుడ్ వంటి జాబ్స్ లో రాణించే అవకాశాలుంటాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)