మాంసం అధికంగా తింటే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం

మాంసం అధికంగా తింటే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారం, కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. " అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ " ఆధ్వర్యంలోని పరిశోధనా బృందం సింగపూర్ లోని 63,257 మంది చైనా దేశీయులను అధ్యయనం చేసింది. 97 శాతం మంది ప్రొటీన్లు అధికంగా ఉన్న మాంసం తిన్నవారిలో కిడ్నీల పనితీరు ప్రమాదంలో పడిందని తేల్చారు. చేపలు, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, సోయా లాంటివి తిన్న వారికంటే పంది, మేక, గొర్రె, ఆవు మాంసం తిన్నవారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది. రెడ్ మీట్ కు ప్రత్యామ్నాయంగా చేపలు, కోడిమాంసం తినవచ్చని సూచించారు. కిడ్నీ సమస్యలున్న వారు ఆకుకూరలు ఎక్కువగా తినాలని సలహా ఇచ్చారు. ఈ పరిశోథనా ఫలితాలను అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్ ప్రచురించింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)