ఇవి పాటిస్తే పళ్లు మిలమిల, ఆరోగ్యంగా, చిరునవ్వు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది

  • పళ్లు మిలమిల మెరవాలంటే, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని టిప్స్‌ ఉన్నాయి. వాటిని పాటిస్తే మీ చిరునవ్వు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
  • తరచూ నోటిని నీటితో పుక్కిలిస్తుండాలి.
  • తీపిపదార్థాలు, ఎసిడిక్‌గా ఉండే పదార్థాలు ఎక్కువగా తినకూడదు.
  • మచ్చలు ఏర్పడే డ్రింకులు, పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాలను  నీటితో బాగా కడిగేసుకోవాలి.
  • కోలాలాంటి కూల్‌ డ్రింకులు, రెడ్‌వైన్‌ను తాగేటప్పుడు స్ట్రా ఉపయోగిస్తే దంతాలపై మచ్చలు ఏర్పడవు.
  • కొందరు దంతాల సెన్సిటివిటీతో బాధపడుతుంటారు. బ్రష్‌తో దంతాలను గట్టిగా తోమడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది. దాంతో దంతాలు సెన్సిటివ్‌ అవుతాయి.
  • దంతాలకు హానిచేసే ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉండాలి. పచ్చళ్లు ఎసిడిక్‌గా ఉంటాయి. ఇవి దంతాలకు హాని చేస్తాయి. పికిల్డ్‌ వెజిటబుల్స్‌కు కూడా దూరంగా ఉండాలి. 
  • డైట్‌ సోడాస్‌ కూడా దంతాలకు మంచిది కాదు. చక్కెర ఎక్కువగా ఉండే క్యాండీస్ కు దూరంగా ఉండాలి. చక్కెర లేని వాటిని తింటే దంతాలకు మంచిది. సలాడ్స్‌ ఆరోగ్యమైనవే అయినా డ్రస్సింగ్‌ కోసం వాటిపై చల్లే తీపి పదార్థాలు దంతాలకు మంచిది కాదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)