ప్రతి రోజూ మీ భాగస్వామితో ఈ విషయాలు మాట్లాడితే మీ కాపురం నిండు నూరేళ్లు హ్యాపీ

జీవితం ఎంత బిజీగా ఉన్నా మీ లైఫ్ పార్టనర్ తో ముచ్చటించేందుకు కొద్ది సమయం కేటాయించుకోవాలట. అసలు మీరు మీ భార్య/భర్త తో ప్రతి విషయం షేర్ చేసుకుంటారా? ఎలాంటి విషయాలు మాట్లాడతారు? ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు?.. ఇప్పుడు ఇవన్నీ ఓసారి సరిచూసుకోవాలని సలహా ఇస్తున్నారు మనస్తత్వ శాస్త్ర నిపుణులు. ఎందుకంటే జీవిత భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎన్నో కొత్త సమస్యలు వస్తున్నాయట. ఆ గ్యాప్ పోయి అన్యోన్యమైన దాంపత్యం వెల్లివిరిసేందుకు రోజూ కొద్ది సమయం కేటాయించుకుని మరీ ఇలా చేయాలట..
  • కొందరు భాగస్వామితో కేవలం మంచి విషయాలే మాట్లాడాలని లేకుంటే రొమాంటిక్ ఐడియాస్ మాత్రమే భాగస్వామితో మాట్లాడాలని భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు. మీరు ప్రేమించే మీ భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాలి. నిజాయితీపైనే మంచి సంబంధం ఆధారపడి ఉంటుంది.
  • ప్రతిరోజూ మీ పార్ట్ నర్ తో మీ కుటుంబం గురించి మాట్లాడాలి. ఫ్యామిలీతో ఎలాంటి సమస్య ఉన్నా మీ భాగస్వామితో చర్చకు పెట్టాలి. ఎందుకంటే మీ పార్ట్ నర్ సరైన వ్యక్తే గనుక అయితే మీకు హెల్ప్ చేస్తారు. 
  • మీ భాగస్వామి ఇష్టాల గురించి మాట్లాడం వల్ల వాళ్ల గురించి మరింత ఎక్కువ తెలుసుకోవచ్చు. అలాగే మీ పార్ట్ నర్ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోండి.
  • ఒకవేళ మీకు అనారోగ్య సమస్య ఉన్నా, లేదా ఏ విషయం గురించైనా బాధపడుతుంటే లేదా ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా మీ పార్ట్ నర్ తో పంచుకోవాలి.
  • ఆర్థికపరమైన విషయాల గురించి ఖచ్చితంగా మీ భాగస్వామితో చర్చించాలి. మీరు ఇతరులకు ఇచ్చే డబ్బు గురించి లేదా ఇతరులతో తీసుకున్న డబ్బు గురించి వివరించాలి. ఏదైనా చేసేటప్పుడు, ఖర్చు చేసేటప్పుడు మీ భాగస్వామికి ఖచ్చితంగా వివరించాలి. ఇలాంటివి కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.
  • బెడ్ రూంలో జరిగిన ప్రతి విషయాన్ని మీ భాగస్వామితో ఖచ్చితంగా ప్రతిరోజూ చర్చించాలి. సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య నిషేధమైనది కాదు. బెడ్ పై ఏది ఇష్టపడతారు, ఏది ఇష్టపడరు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
  • మీ భార్యతో ప్రతిరోజూ చర్చించాల్సిన విషయాలలో ముఖ్యమైనది. ఏది ఆసక్తికరమైనది వంటి చేయడం, గార్డెనింగ్, రాయడం, యోగా లేదా ఇతర ఏపనిని ఇష్టపడతారు అనేది తెలుసుకోవాలి. మీకు ఇష్టమైనవాటి గురించి మీ భాగస్వామి తెలుసుకుంటే.. చాలా హ్యాపీగా ఉంటుంది. 
  • అలాగే వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా ఎలాంటి లక్ష్యాలు సాధించాలి అనుకుంటున్నారో చెప్పాలి. ఇలా వీటన్నింటి గురించి మీ భాగస్వామితో ప్రతిరోజూ చర్చించుకుంటే.. మీ బంధం చాలా బలపడుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)