కొవ్వుని తగ్గించే 12 సూపర్ ఫుడ్స్ వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే బోలెడంత ఆరోగ్యం

  • వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెల కంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
  • బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు.
  • కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. 
  • తేనె మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో రెండు స్పూన్ లు తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.
  • చెక్కా లవంగాలు లేకుండా మసాలా వంటలు ఉండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రైకోగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి.
  • రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'లో డెన్సిటీ లిపొప్రొటైన్' అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
  • తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.ఇది వరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.
  • మిర‌ప‌ తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు.
  • శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో అయితే బరువు తొందరగా తగ్గుతారు.
  • అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తో పాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది.
  • బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే.
  • వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

Popular Posts

Latest Posts