ఎండలో తిరగడం, దుమ్ము, చెమట వల్ల చర్మం నల్లబడుతుంది అప్పుడు ఇలా చేయండి మెరిసే చర్మం మీ సొంతం

అలోవెరా
ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి అలోవెరా జెల్‌ (కలబంద గుజ్జు) బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని నల్లబడ్డ శరీరంపై రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో కడిగేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే చక్కని ఫలితాలు వస్తాయి.
బేకింగ్‌ సోడా
ఒక భాగం నీరు, 3 భాగాల బేకింగ్‌ సోడాను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. మిశ్రమం స్మూత్‌గా వచ్చే వరకు పేస్ట్‌ను బాగా కలపాలి. దీన్ని నల్లబడ్డ భాగాలపై రోజుకు రెండు సార్లు రాస్తే ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ
చర్మానికి ప్రకాశాన్ని, మెరుపును కలిగించే గుణాలు నిమ్మలో అధికంగా ఉన్నాయి. కొద్దిగా నిమ్మ రసాన్ని తీసుకుని నల్లబడ్డ ప్రదేశంలో రాయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగి, తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.
కీరదోస
కీరదోసకాయ ముక్కలు కొన్ని, కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలిపి మిక్సీలో వేసి పట్టాలి. ఈ మిశ్రమాన్ని నల్లబడ్డ భాగాల్లో రాస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.
పాలు
పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల్లో చర్మాన్ని సంరక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొద్దిగా పాలు, పెరుగును తీసుకుని మిశ్రమంగా కలిపి చర్మంపై రాయాలి. ఇది పొడి చర్మం కలవారికి మేలు చేస్తుంది.
ఆలుగడ్డ
కొద్దిగా నీటిని, కొన్ని ఆలుగడ్డలను తీసుకుని మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నల్లబడ్డ శరీర భాగాలపై రాయాలి. కొద్దిసేపు ఆగాక కడిగేయాలి. ఇది మృత చర్మ కణాలను వేగంగా తొలగిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)