పడుకునే సమయంలో చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు మరి మీరు కూడా చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి

చాలా మంది రాత్రి పడుకోబోయే సమయంలో ఎక్కువగా కుడివైపే తిరిగి పడుకుంటారు. కానీ ఎడమ వైపు తిరిగి పడుకుంటేనే రాత్రి సమయంలో గాఢనిద్ర పడుతుందనీ, అంతేకాక మరుసటి రోజు చురుకుగా ఉంటారనీ బ్రిటన్‌ పరిశోధకులు అంటున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదని కూడా వారు సూచిస్తున్నారు. సుమారు మూడు వేల మందిపై వీరు పరిశోధనలు నిర్వహించారు. రాత్రి సమయంలో కుడి వైపుకు తిరిగి పడుకునే వారికన్నా ఎడమ వైపు తిరిగి పడుకున్న వారే మరుసటి రోజు ఎక్కువ ఉత్సాహంగా, చురుకుగా వ్యవహరించడాన్ని వీరు గుర్తించారు. ఎడమ వైపు తిరిగి పడుకున్న వారిలో ఆహారం త్వరగా జీర్ణం కావడాన్ని వీరు గమనించారు. ఇలాంటివారు పని ఒత్తిడిని కూడా ఫీలవరని చెబుతున్నారు. కుడివైపుకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు ఎడమ వైపు తిరిగి పడుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Popular Posts

Latest Posts