మహా విష్ణువు ఎత్తిన అవతారమే ధన్వంతరి.. సమస్త ప్రాణకోటి ఆరోగ్యము కోసం ధన్వంతరి చెప్పిన 5 అద్భుత ఆరోగ్య రహస్యాలు

Loading...
మానవుల ఆరోగ్య రహస్యాలను గురించి అష్టాదశ పురాణాల్లో ఒకటైన విష్ణుధర్మోత్తర పురాణంలో పేర్కొన్నారు. ఇందులో విశ్వం పుట్టుక, ఖగోళ శాస్త్రం, యుద్ధ తంత్రాలు, శిక్షలు, వ్యాధులు, వాటి చికిత్సల గురించి చక్కగా తెలిపారు. పాల సముద్రాన్ని మధించినపుడు శ్రీ మహా విష్ణువు అమృత క‌ల‌శంతో ధన్వంతరిగా అవతరించారు. ధన్వంతరిని ఆయుర్వేదానికి ఆద్యుడిగా భావిస్తారు. ధన్వంతరి తన విజ్ఞానాన్ని వారణాసి రాజు దేవదాశతో పంచుకున్నట్లు విష్ణుధర్మోత్తర పురాణంలో తెలిపారు. వ్యాధులు ఎందుకు వస్తాయో కారణాలు కూడా తెలిపారు.
5 అద్భుత ఆరోగ్య రహస్యాలు:
  • ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, గుండె బలహీనత, ప్రొస్టేట్ కేన్సర్ లాంటివి వస్తాయట.
  • * ఆహారం తిన్నాక స్నానం చేయరాదు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో శరీరంలో వ్యాధులు సంభవిస్తాయి.
  • శరీరంలో ప్రతి అవయవం ప్రత్యేక పనికోసం నిర్మితమైంది. శ్వాస కేవలం ముక్కు ద్వారా మాత్రమే పీల్చుకోవాలి. ఉచ్వాశ, నిశ్వాసలు నోటి ద్వారా జరిగితే మీ ఆయుష్షు సగానికి తగ్గిపోతుంది.
  • గుండె సంబంధ సమస్యలతో సతమతమయ్యేవారు పచ్చి కూరగాయల రసాన్ని తీసుకోవాలి. పుదీనా ఆకులు, అర్జున చెట్టు బెరడు, తులసి ఆకులను రసాన్ని కూడా తీసుకోవాలి. తెల్ల ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సైంధవ లవణాన్ని వినియోగించాలి.
  • భోజనం తర్వాత సోంపు, బెల్లం లాంటివి తీసుకుంటే త్వరగా జీర్ణం కావడమే కాకుండా పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
Loading...

Popular Posts