ప్యూర్ వెజ్ అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా కొంత మాంసాహారం కలుస్తుంది అవేంటంటే ?

Loading...
మీరు శాఖాహార ప్రియులా? శాఖాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే శాఖాహారం అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా కొంత మాంసాహారం కలుస్తుందట! ఆశ్చర్యంగా ఉందా! కానీ ఇది నిజమే. శాఖాహారంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాల్లో ఎంత లేదన్నా కొంత మాంసం లేదా దాని సంబంధ పదార్థాలు కచ్చితంగా ఉంటాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
చక్కెర…
చక్కెర తయారు చేసే సమయంలో దాన్ని శుద్ధి చేయడం కోసం సహజసిద్ధమైన నాచురల్ కార్బన్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడే విషయం అంతా ఉంది. ఆ నాచురల్ కార్బన్‌ను జంతువుల ఎముకలను కాల్చడం ద్వారా తయారు చేస్తారు. ఇప్పుడర్థమైందా! చక్కెర కూడా మాంసాహార సంబంధ పదార్థమేనని. ఈ క్రమంలో చక్కెరను వాడాలనుకుంటే అన్‌రిఫైన్డ్ షుగర్‌ను వాడితే సరిపోతుంది. లేదంటే దాని బదులు బెల్లం కూడా ఉపయోగించవచ్చు.
ఫ్రెంచ్ ఫ్రైస్…
కరకరలాడుతూ ఘాటు ఘాటుగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట. బీఫ్ కొవ్వు నుంచి తీసిన కొన్ని పదార్థాలను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారట. అయితే ఆ పదార్థాలను ముందుగా ప్రాసెస్ చేస్తారు. అనంతరం ఫ్రైస్ తయారీలో ఉపయోగిస్తారు.
బ్రెడ్…
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న బ్రెడ్, గుండె ఆరోగ్యానికి మంచిది అంటూ అనేక కంపెనీలు తమ తమ బ్రెడ్లను అమ్ముతుంటాయి. అయితే వాటిలో చేపల ఆయిల్‌తోపాటు, అవిసె గింజలు, మనిషి, పంది, కోడి వెంట్రుకల నుంచి తీసిన ఎల్-సిస్టీన్ అనే పదార్థాలను ఉపయోగిస్తారట.
ఆల్కహాల్…
బీర్, వైన్ వంటి ఆల్కహాల్ డ్రింక్స్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట. ఫిష్ బ్లాడర్ లేదా ఎండ్రకాయ డొప్పలు లేదా జంతువుల ఎముకలు, లిగ్‌మెంట్స్ నుంచి తీసిన పలు పదార్థాలను ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారీలో వాడతారట.
సూప్స్…
రెస్టారెంట్లలో సూప్‌లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే వాటి తయారీలో వాడే సాస్‌లలో చేపల నుంచి తీసిన పదార్థాలను వాడతారట.
నూనెలు…
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న నూనెలు గుండెకు చాలా మంచివని ఆయా కంపెనీలు తమ తమ వంట నూనెలను అమ్ముతుంటాయి. అయితే వాటిలో చేపలు లేదా గొర్రెల నుంచి తీసిన లానొలిన్ అనే పదార్థాలను వాడతారట.
సలాడ్ డ్రెస్సింగ్స్…
కూరగాయలు, పండ్ల సలాడ్స్ కోసం వాడే డ్రెస్సింగ్ ఆహార పదార్థాల్లో కోడిగుడ్ల నుంచి తీసిన అవశేషాలు ఉంటాయి. కాబట్టి సలాడ్స్‌లో కూడా మాంసాహారం ఉంటుంది.
జెల్లీ…
జంతువుల మాంసం నుంచి తీసిన గెలాటిన్ అనే పదార్థం జెల్లీల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం అధిక శాతం జెల్లీల్లో గెలాటిన్‌కు బదులుగా ఇతర పదార్థాలను వాడుతున్నారు. కాబట్టి కొంత వరకు సేఫ్‌గానే ఉండవచ్చు.
కేక్ మిక్స్…
ఎగ్ లేకుండా తయారు చేసిన కేకులను ప్రస్తుతం ఎక్కువ మంది శాఖాహారులు తింటున్నారు. అయితే వారు కేక్ మిక్స్‌లతో కేకులను తయారు చేసుకుని తింటున్నారు. ఈ క్రమంలో కేక్ మిక్స్‌లను ఒకసారి పరిశీలిస్తే వాటిలో పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలు ఉంటాయట. కాబట్టి కేక్ మిక్స్‌లపై కూడా జాగ్రత్త వహించాలి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...