టీ తాగేటప్పుడు మనం చేసే చిన్నతప్పు వలన ఎన్నో రోగాలకు కారణం అవుతుంది

సాధార‌ణంగా చాయ్ మీద మీగ‌డ పేరుకుపోవ‌డ‌మ‌నేది అందులో క‌లిపే పాల వ‌ల్ల వ‌స్తుంది. పాల‌ను కొద్దిగా వేడి చేసిన‌ప్పుడు అందులో ఉండే తేలిక‌పాటి కొవ్వులు దాని మీద పొర‌లా వ‌చ్చి మీగ‌డ‌లా పేరుకుంటాయి. ఆ క్ర‌మంలో ఆ పాల‌తో చాయ్ పెడితే ఆ చాయ్‌పై కూడ మీగ‌డ పొర‌లా వ‌స్తుంది. దీర్ఘ కాలికంగా అలా తాగితే మాత్రం కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

మీగ‌డలో పాల‌క‌న్నా అధికంగా కొవ్వు ప‌దార్థాలు ఉంటాయి. పాల‌క‌న్నా దాదాపుగా 20 నుంచి 36 శాతం వ‌ర‌కు అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్‌, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి మోతాదుకు మించితే మాత్రం రక్త నాళాల్లో పేరుకుపోతాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. త‌ద్వారా దీర్ఘ‌కాలికంగా ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక టీ తాగే వారు మీగ‌డ‌ను తీసేసి తాగితేనే మంచిది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)