నేను రోజూ చేసే పని నాకు సరిపోతుంది నేను మార్నింగ్ వాక్ చేస్తే ఏంటి లాభం ? అని అడిగేవాళ్ళ కోసమే ఈ ఆర్టికల్

శరీరం మీద భక్తి శ్రద్ధలే ఉంటే, రోజూ ఉదయాన్నే లేచి తప్పకుండా మార్నింగ్ వాక్ కి వెళతారు. " ఇలా చేస్తే ఏంటి లాభం" ? అని లేట్ గా లేచే బద్ధకస్తులు అడగొచ్చు. వారి కోసమే ఈ ఆర్టికల్.
  • రోజూ ఓ 20 నిమిషాలపాటు మార్నింగ్ వాక్ చేస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 30% తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
  • పొద్దున్నే వాకింగ్ చేస్తే ఇటు చల్లగాలితో పాటు, ఆరోగ్యకరమైన తెల్లవారి సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతాయి దీని వలన విటమిన్ D లభిస్తుంది.
  • అధిక బరువు సమస్యలను తగ్గించుకోవడానికి, బరువు పెరగకుండా అడ్డుకోవడానికి మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగం. 
  • బ్లడ్ ప్రెషర్ అదుపులో లేక ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు చాలామంది. రోజూ మార్నింగ్ వాక్ చేస్తే ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు. 
  • ఇమ్యునిటి సిస్టమ్ ఎంత బలంగా ఉంటే, రోగనిరోధకశక్తి అంత ఎక్కువగా ఉంటుంది. రోజు 40-50 నిమిషాలు వాకింగ్ చేసే శరీరంలో ఇమ్యునిటి సెల్స్ పెరుగుతాయని అధ్యయనాల్లో తేలింది. ఈరకంగా రోగనిరోధకశక్తిని పెంచి, శరీరాన్ని ఇంఫెక్షన్ల నుంచి కాపాడటానికి వాకింగ్ సహాయపడుతుంది.
  • రోజూ వాకింగ్ చేస్తే ఎనడొర్ఫీన్స్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది సంతోషాన్ని పెంచే హార్మోన్. కాబట్టి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి మార్నింగ్ వాక్ ఉపయోగపడుతుంది .
  • మార్నింగ్ వాక్ వలన శరీరంలోని ప్రతి సెల్ కి, రక్తప్రసరణ బాగా జరగడమే కాకుండా, ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా అందుతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)