బరువు పెరుగుతామని నెయ్యి తినడం మానేస్తున్నారా ? అతిగా కాకుండా ఒక మోతాదులో నెయ్యి తీసుకుంటే ఎన్నో ఎన్నో ఉపయోగాలు

Loading...
  • నెయ్యి మెదడుకు, నరాల వ్యవస్థకు మంచిది. ఇందులోని ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్స్‌.. శరీరక ఆరోగ్యానికి ఉపకారం చేస్తాయి.
  • ఈ రెండు యాసిడ్లు డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటివి అంత త్వరగా దరిచేరనీయవు. తరచూ ఒక మోతాదులో నెయ్యి తీసుకుంటే మెదడులోని నాడీ వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
  • నెయ్యిలో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ పుష్కలం. దీంతో వంటలు చేసుకున్నప్పుడు.. మిగిలిన నూనెల్లాగ త్వరగా మాడే గుణం ఉండదు. దీని వల్ల కేన్సర్‌ ముప్పు తగ్గుతుంది. కణజాలాన్నీ సంరక్షించే గుణం ఉంది.
  • సులువుగా జీర్ణం కావడానికి అవసరమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది నెయ్యి. శరీరంలో జీర్ణవ్యవస్థ చురుగ్గా సాగితే సగం సమస్యలు తొలగుతాయి.
  • నెయ్యి.. కీళ్లనొప్పులు, ఒళ్లునొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. ఒక వయసు వచ్చాక మోకాళ్ల కీళ్లు అరుగుతాయి. ఎముకల పటుత్వం తగ్గుతుంది. ఇటువంటి సమస్యలను దరి చేరనివ్వదు నెయ్యి.
  • నెయ్యి ఆరోగ్యానికి మంచిది కదాని అందరూ తినకూడదు. గుండెజబ్బులు, మధుమేహం, స్థూలకాయమున్న వాళ్లు.. నెయ్యికి దూరంగా ఉండటం మేలు.
Loading...

Popular Posts