ఇకపై మీ ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా డబ్బు సంపాదించవచ్చు..!

Loading...
ఫేస్‌బుక్ ఎక్కువగా వాడుతున్నారా? ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతున్నారా? నిత్యం గంటల తరబడి అందులో విహరిస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఫేస్‌బుక్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అదే కంటెంట్ మానెటైజేషన్. అంటే మీరు పోస్టుల్లో పెట్టే కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చన్నమాట!
అయితే ఇందుకోసం యూజర్లు తాము పెట్టే పోస్టుల్లో ఫేస్‌బుక్ అందించే యాడ్స్‌ను ఉంచాల్సి వస్తుంది. వాటిని ఎవరైనా వేరే యూజర్లు క్లిక్ చేస్తే ఆ అకౌంట్ హోల్డర్‌కు డబ్బులు వస్తాయన్నమాట. ఇప్పటికే దీనిపై ఆ సంస్థలో అంతర్గతంగా పలు ప్రయోగాలు జరుగుతున్నట్టు సమాచారం. అమెరికాలో కొంత మంది వెరిఫైడ్ యూజర్లకు ఫేస్‌బుక్ పలు సర్వేలు కూడా నిర్వహిస్తోందని తెలిసింది. ఈ క్రమంలో అతి త్వరలోనే ఫేస్‌బుక్ తన అడ్వర్టయిజింగ్ ద్వారా యూజర్లకు డబ్బు సంపాదించుకునే వెసులు బాటు కల్పించనుందని తెలుస్తోంది. బ్రాండ్ స్పాన్సర్‌షిప్, మార్కెటింగ్, డొనేషన్ వంటి పలు విధానాలను కూడా ఫేస్‌బుక్ తన యూజర్లకు అందుబాటులోకి తేనుందని తెలిసింది. ఇంకేం! ఫేస్‌బుక్ కంటెంట్ మానెటైజేషన్ వచ్చేదాకా ఆగండి! ఎంచక్కా పోస్టులు కొడుతూ డబ్బులు సంపాదించవచ్చు.
Loading...

Popular Posts