స్లిమ్ గా ఉండాలనుకుంటే ఈ సూపర్ టిప్స్ పాటించాల్సిందే

లావుగా ఉన్నవారి కష్టాలు మామూలుగా ఉండవు. నలుగురు కామెంట్ చేస్తారని, సరిగా కలిసి తిరగలేరు, ఆత్మవిశ్వాసం కరువై సరిగా మాట్లాడలేరు. ఇవి పక్కనపెడితే అధికబరువు వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు. స్లిమ్ గా ఉండాలనుకుంటే ఈ సూపర్ టిప్స్ పాటించాల్సిందే.

  • పొద్దున్నే అల్పాహారంలో ప్రొటీన్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఉదయాన్నే ప్రొటీన్లు శరీరంలోకి చేరితే, ఆకలి ఎక్కువగా వేయదు. అప్పుడు అతిగా తినే సమస్య ఉండదు.
  • పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే సాల్యుబల్ ఫైబర్ అవసరం. ఈ ఫైబర్ ఎక్కువగా బార్లీ, సీడ్స్, నట్స్, బఠాణీలు, కొన్నిరకాల పళ్ళు, కూరగాయల్లో దొరుకుతుంది. కాబట్టి ఇవి డైట్ లో చేర్చుకొవాలి.
  • తియ్యటి వస్తువులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే జ్యూస్ కి బదులు, పండ్లని అలాగే తినేయటం మేలు.
  • కాఫీని ఓ లిమిట్ లో తాగితే మంచిది. దానిలో దొరికే కెఫైన్ జీవక్రియలని పెంచుతుంది.
  • భోజనానికి అరగంట ముందు నీళ్ళు తాగడం మరచిపోవద్దు. బరువు తగ్గడానికి అతి సునాయసనమైన చిట్కా ఇది. మూడు నెలరోజులపాటు ఇలా చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.
  • నిద్రలేమి సమస్య, అలాగే అతినిద్ర ఆధికబరువుకి కారణమవుతుంది. కాబట్టి శరీరానికి అవసరమైన 7-8 గంటల నిద్ర ప్రతీరోజు శరీరానికి ఇవ్వాలి.
  • ఇంతే కాదు, వ్యాయామం చేయడం తప్పనిసరి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఆహారాన్ని మెల్లిగా తినటం నేర్చుకోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)