మూడు పూటలు ఇలా చేయండి.. నెల రోజుల్లో అధిక బరువు తగ్గడమే కాకుండా చాలా వ్యాదులు రాకుండా చేస్తాయి

వ్యాయామం ఎంత చేసినా సన్నపడటంలేదు, ఎంత పొట్ట కాల్చుకున్న ఆ పొట్టే తగ్గడం లేదు మరి అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరో ఒక్కళ్ళు ఏదోకటి చెప్తూనే ఉంటారు మరి అన్నీ చేయాలా అంటే మీకు ఏది అనువైనది అయితే అది చెయ్యండి. మరి ఎం చెయ్యాలో చూద్దామా. 
రాత్రిపూట చాలా ముఖ్యం
రాత్రి పూట నియమాల వల్ల మనం బాగా సన్నపడతాము, నియమాలు అంటే అవేమి పెద్దవి కావు చాలా తేలిక అవేమిటో ఇప్పుడు చూద్దాము
రాత్రి మీరు పడుకునే 2 గంటల ముందే భోజనం ముగించాలి మీరు 12 గంటలకి పడుకుంటే 10 గంటలకి తినేయండి.
రాత్రి పూట అన్నం బదులు చపాతీ లేదా ఇడ్లీ లేదా దోశలు ఏదైనా టిఫిన్ చేయవచ్చు దీనివల్ల బరువు బాగా తగ్గుతారు.
ఎక్కువ నీరు త్రాగకుండా తగిన మోతాదు లో తీసుకోండి
పొద్దున్న పూట చెయ్యవలసిన పనులు
పొద్దున్న పూట పంచదార లేని పాలు త్రాగాచ్చు, ఒక కప్పు కాఫీ త్రాగాచ్చు లేదా టీ త్రాగాచ్చు, అయితే పొద్దున్న పూట టిఫిన్ అనేది మీ ఒంట్లో అధిక కొవ్వుని తగ్గించే ఫలహారం లాంటిది, ఎందుకంటే దాదాపు 6 నుండి 7 గంటలు వరకు మనం ఏమి తినము అలాంటపుడు మన కడుపు చాలా నీరసంగా ఉంటుంది, అందుకే నిద్ర లేచిన 3 గంటల లోపు టిఫిన్ తినేస్తే సరిపోతుంది,మరి టిఫిన్ లోకి ఏమి తినాలి? చాలా చాలా మంచి టిఫిన్
అయితే ఇడ్లీ, తర్వాత నూనే తక్కువ వేసి చేసిన ఉప్మా ఇంకా తొందరగా సన్నపడాలి అనుకుంటే ఓట్స్ ఇది ఉదయం 10 గంటల లోపు తినేయాలి. మరి అన్నానికి టిఫిన్ కి మధ్యలో ఎం అక్కర్లేదా అంటే వేడి వేడి గ్రీన్ టీ త్రాగాచ్చు, లేదు అనుకుంటే పండ్ల రసం, లేదు ఇది చలి కాలం అనుకుంటే మంచి వేడిగా ఉండే సూప్, ఇలా తీసుకుంటే సన్నపడటమే కాకుండా మంచి తీరైన ఆకృతి వస్తుంది.
మధ్యానం పూట ఇలాగా చెయ్యండి
మధ్యానం పూట బరువు త్వరగా తగ్గాలి అనుకుంటే 2 చపాతీలు పప్పుతో కాని కూరతో తినండి, తిన్నాక కొంచం అన్నంలో పెరుగు లేదా మజ్జిగ వేసుకుని తినాలి. తిన్న వెంటనే అస్సలు పడుకోకండి అలాగా అని నడవకండి ప్రశాంతంగా ఒక్క 10 నిముషాలు కూర్చోండి. సాయంకాలం కావాలంటే పండ్లు తీసుకోవచ్చు లేదా నిమ్మరసం తేనే కలుపుకుని త్రాగాచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)