మీ ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను పోగొట్టుకున్నారా ?

మీ ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను పోగొట్టుకున్నారా ?
అయితే దీనిని ఒక్కసారి చదవండి.
డూప్లికేట్ పత్రాలను పొందడం ఎలాగో తెలుస్తుంది.

చాలా మంది తమ పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించిన అసలుపత్రాలను పొరపాటున పోగొట్టుకుంటారు.

అలాంటప్పుడు ఆస్తులకు సంబంధించి ఏవైనా తగాదాలు వచ్చినప్పుడు గానీ, ఆస్తులను అమ్మాలనుకున్నప్పుడు గానీ చాలా సమస్యలు వస్తాయి.

మరి అలాంటి పరిస్థితుల్లో ఆస్తి యొక్క హక్కు పత్రాలను పొందటం ఎలాగంటే...

ఆస్తులకు సంబంధించిన అసలు పత్రాలు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, పోలీస్ శాఖ ఇచ్చే ఎఫ్ఐఆర్ కాపీని జాగ్రత్తగా పెట్టుకోండి.

ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాక, పోయిన ఆస్తి పత్రాలకు సంబంధించి ఒక ఇంగ్లీష్ పేపర్ మరియు ఒక తెలుగు పేపర్ లో ప్రకటన ఇవ్వండి.

ఒకవేళ మీరు ఏదైనా అపార్ట్ మెంట్ లో ఉంటుంటే, ఎఫ్ఐఆర్ కాపీని జతపరుస్తూ మీ వాటాకు సంబంధించి మీరు ఉంటున్న హౌసింగ్ సొసైటీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. దానితో పాటు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోండి.

తర్వాత ఎఫ్ఐఆర్, ఎన్ఓసి, వాటా సర్టిఫికేట్ ల ఆధారంగా ఒక స్టాంప్ పేపర్ ను సిద్ధం చేసుకొని, నోటరీతో అటెస్ట్ చేయించండి. దాని వల్ల చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.

ఇపుడు పైన పేర్కొన్న పత్రాలన్నిటినీ తీసుకొని, ఆ ఆస్తి ఏ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో ఉంటే ఆ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇవ్వాలి. నిర్ణీత ఫీజు కూడా చెల్లిస్తే, ఆ రిజిస్ట్రార్ ఆఫీసు మీకు డూప్లికేట్ సేల్ డీడ్ జారీ చేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)