ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. నిజంగా ఇది లక్షలు విలువచేసే మాట. ఉల్లి వలన ఎన్నో రోగాలు నయమవుతాయి

Loading...
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు! నిజంగా ఇది అక్షర లక్షలు విలువచేసే మాట. పొట్టనిండా విటమిన్లు నింపుకున్న పాయ, మన ఉల్లిపాయ. రక్తపుష్టి, కేశవృద్ధి, గుండె వ్యాధుల నివారిణి, కీళ్ళనొప్పుల నివారిణి, కీటక సంహారిణి, నిద్రకారిణి, ఉష్ణ నివారిణి, నొప్పి నివారిణి, రక్త ప్రసరణ వాహినీ.. అబ్బో! ఇలా ఉల్లిదండకం చదివితే ఎంతకీ తెమల్దు.
కొలెస్ట్రాల్‌ తగ్గించడమే కాదు జీర్ణక్రియను, షుగర్‌లెవెల్స్‌ను క్రమబద్దీకరిస్తుంది ఉల్లి. బాక్టీరియా మన దరిజేరకుండా కాపాడుతుంది. ఉల్లిపాయ తినడం వల్ల మాత్రమేకాదు దానితో ఆరోగ్య సమస్యలెన్నింటినో దూరం చేసుకోవచ్చునంటున్నారు పరిశోధకులు. దాదాపు ఐదువేలఏళ్ల నాటిది ఉల్లిపాయ చరిత్ర!
ఉల్లిపాయ ఆసియాలో పుట్టిందని కొందరంటే ప్రస్తుతం పాకిస్థానగా పిలుస్తున్న ప్రాంతంలో పుట్టిందని మరికొందరంటుంటారు. ఏదేమైనా ఆరోగ్యాన్ని చేకూర్చే ఉల్లి సర్వేసర్వత్రా లభ్యమవుతోంది. ఏ రూపంలో దీన్ని తిన్నాసరే వీటిలో ఉండే పదార్థాలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అయితే ఎక్కువగా తినడం వల్ల నష్టమూ ఉంది. కాబట్టి శరీరానికి సరిపడ మితంగా ఉల్లిని తీసుకోవడం చాలా మంచిది. ఆ మంచేమిటో, ఆ లాభాలేంటో చదవండి!

విటమిన్ల సముదాయం
యాంటీసెప్టిక్‌, యాంటీ బయాటిక్‌, యాంటీ మైక్రో బాక్టీరియల్‌ లక్షణాల నిలయం ఉల్లిపాయ. విటమిన సీ, బీ 12, బీ 6, విటమిన కె, బయోటిన, క్రోమియం, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, డైటరీ ఫైబర్‌ ఫుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోజూవారి ఆహారంలో ఉల్లిపాయ తింటే మనకు ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. తినడం వల్ల మాత్రమే కాదు, ఉల్లిని మనవెంట ఉంచుకుంటే చాలట! వైరస్‌, బాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను మనదరిజేరనీయదట. టెస్టోస్టిరాన, ఇన్సులిన, గ్రోత హార్మోన వంటి హార్మోన్ల లక్షణాలు ఉల్లిలో ఉన్నాయి. అందుకే రక్తశుద్ధికీ, రక్తవృద్ధికీ ఉల్లి దోహదపడుతుంది.

కొలెస్ర్టాల్‌ తగ్గుతుంది
శరీరంలోని కొలెస్ర్టాల్‌ను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసేకంటే, రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే చాలు కొలెస్ర్టాల్‌ తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అది షుగర్‌ లెవల్స్‌ను క్రమబద్దీకరించడమేకాదు టైప్‌-2 డయాబెటి్‌సను నివారిస్తుంది. రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే అధిక కొలెస్ర్టాల్‌ను అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. బ్లడ్‌ షుగర్‌ స్థాయిలనూ నియంత్రిస్తుంది. గ్లూకోజ్‌ శక్తిని పెంచుతుంది. అల్లిల్‌ ప్రోపిల్‌ డిసల్ఫయిడ్‌ తగ్గిన బ్లడ్‌ షుగర్‌ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది.

దగ్గు మాయం
ఉల్లిపాయను రెండు ముక్కలు చేసి ప్రతి పొరలోనూ ఒక టేబుల్‌స్పూన బ్రౌన షుగర్‌ అప్లయి చేయాలి. తర్వాత ఆ ముక్కల్ని పాయరూపంలో దగ్గరకు నొక్కి ఒక జార్లో గంటసేపు ఉంచాలి. దాన్ని రోజుకు రెండుసార్లు వాసన చూస్తుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. లేకపోతే ఉల్లిపాయ రసం, తేనె రెంటినీ సమభాగాల్లో తీసుకుని బాగా గిలక్కొట్టి తాగితే గొంతునొప్పి, దగ్గు తగ్గిపోతాయి. ఇతర ఇన్ఫెక్షన్లను కూడా ఇది నివారిస్తుంది.

చెవినొప్పి నివారణ
చెవినొప్పి నివారణకు ఉల్లి బాగా పనిచేస్తుంది. చెవులు గింగురుమంటున్నప్పుడు దూదిమీద ఉల్లిరసం పిండి దాన్ని చెవిలో ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది లేదా ఉల్లి రసం వేడిచేసి చల్లార్చి చెవిలో వేస్తే చిన్నపిల్లలకు చెవినొప్పి తగ్గిపోతుంది. ఉల్లిపాయ పేస్ట్‌ను నొప్పి ఉన్న ప్రదేశంలో పూసి, ఒక గుడ్డ చుట్టిఉంచడంవల్ల కూడా నొప్పి క్రమంగా నయమవుతుంది.

గుండెకు మేలు

గుండె, రక్తనాళాలకు ఉల్లికాడలు ఎంతో మేలు చేస్తాయి. కొలెసా్ట్రల్‌ ఆక్సీకరణను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని రక్తాన్ని పల్చగా చేసి కణాలన్నింటికీ ప్రసరణ చేసేందుకు ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్‌ వ్యాధులకు దారి తీయవచ్చు. గుండె జబ్బులు, బీపీతో బాధపడే వారు రోజూ 100 గ్రాముల ఉల్లి తీసుకోవడం చాలా మంచిది. ఉల్లిపాయలోని సల్ఫర్‌ కాంపౌండ్‌ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిని నియంత్రించి, బ్లడ్‌ కొలెస్ర్టాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

జ్వర నివారిణి
జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ తింటే జ్వరం ఎక్కువవుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఉల్లిపాయ హై బాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. రెండు బాగాలుగా కట్‌చేసిన ఉల్లిపాయను గుజ్జుగా కానీ లేదా ఆ రెండుముక్కల్నిగానీ పాదాలకింద ఉంచుకోవాలి. సాక్సులు వేసుకుని రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేస్తే జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స జబ్బులను నివారిస్తుంది.

వాంతులు తగ్గుతాయి

ఉల్లిపాయల్ని రుబ్బి దాంట్లోంచి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ‘స్ర్టాంగ్‌ పుదీనా టీ’ రెడీగా ఉంచుకోవాలి. ముందుగా రెండు చెంచాల ఉల్లిరసం తాగి, ఐదు నిమిషాల విరామం తర్వాత రెండు చెంచాల చల్లటి పుదీనా టీ తాగాలి. మరో ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో ఉల్లిరసం, పుదీనా టీ రెండు చెంచాల చొప్పున విరామంతో సేవించాలి. ఇలా చేస్తే వాంతులు తగ్గిపోతాయి. అజీర్తి వల్ల వాంతులు, విరోచనాలు వస్తే అరకప్పు ఉల్లిపాయరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి అప్పుడప్పుడు తాగితే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడతాయి.

రక్తస్రావాన్ని అరికట్టే ఉల్లి
ముక్కులోంచి రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కోసి ముక్కుదగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కీటకాలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశంలో అప్లయి చేయాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది. గాయంచుట్టూ క్రిములు చేరకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలు తినడంవల్ల రక్తపుష్టి కూడా కలుగుతుంది. ఉల్లిలోని ఐరనని మన శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది.

పొట్టనొప్పి నివారణ
పిల్లల్లో పొట్టనొప్పి నివారించడానికి ఉల్లి మంచి దోహదకారి. అందుకు మనం చేయాల్సిందల్లా, కొంచెం నీళ్ళల్లో ఉల్లిపాయను వేసి ఉడికించాలి. ఆ ఉల్లినీటిని చల్లార్చి పిల్లలకు ఒక చెంచాడు తాగిస్తే తక్షణ రిలీఫ్‌ లభిస్తుంది. ఇలా గంటకొక్కసారి చెంచాడు ఉల్లినీరు తాగిస్తే నొప్పి నివారణవుతుంది. ఉల్లికాడలలో పెక్టిన (నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌) ముఖ్యంగా పెద్దపేగు కేన్సర్‌ అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలో స్థూలపోషకాలు ఉండడంవల్ల ఇది జీవక్రియ క్రమబద్దీకరణకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను నీళ్లలో వేడిచేసి ఆ నీటికి కొంచెం చక్కెర చేర్చి పిల్లలకు తాగిస్తే వారికి మంచి నిద్ర పడుతుంది.

ఉల్లితో అందమైన జుట్టు
జుట్టు సంబంధిత సమస్యల ఉపశమనానికి ఉపయోగపడే మెరుగైన పదార్థాల్లో ఉల్లి ఒకటి. ఇందులోని పోషకాలు జట్టును మరింత బలంగా మార్చి వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్‌ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుంటాయి. ఇక ఉల్లిరసరం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న ఫంగ్‌సని ఉల్లి హరింపజేస్తుంది. చుండ్రును నివారించి తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కల్పించే ఈ ఉల్లిరసాన్ని వారంలో మూడుసార్లు తలకు పట్టిస్తే రెండునెలల్లో ఎన్నో ఫలితాలు పొందవచ్చు. ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసి వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం ఈ ఉల్లి పేస్టును ఒక బుట్టలో తీసుకుని రసం పిండాలి. ఈ రసాన్ని తలకు పట్టించి ఐదు నిమిషాలపాటు మృదువుగా మసాజ్‌ చేయాలి, ఇలా చేసిన అనంతరం 45 నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే ఉల్లిపాయ రసంలో క్యాటలైజ్‌ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి.

కీళ్లవాతానికి ఉల్లితో చెక్‌ 
తీసుకునే ఆహారంలో ఉల్లి అధికంగా ఉండేలా చూసుకుంటే కీళ్లవాతం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఆరోగ్యంగా ఉన్న వెయ్యిమంది కవలలపై లండనలోని కింగ్స్‌ కళాశాల పరిశోధకుల అధ్వర్యంలో వారు తీసుకుంటున్న ఆహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మిగిలిన వారితో పోలిస్తే ఆహారంతో పాటు ఉల్లి తీసుకున్న వారిలో కీళ్లవాతం ముప్పు లక్షణాలు తక్కువగా కనిపించినట్లు గుర్తించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య వయసులో ఉన్న చాలా మంది కీళ్లవాతం బారిన పడుతున్నారు. మోకాళ్లు, వెన్నెముక, తుంటి భాగాల్లో నొప్పితో శారీరకంగానే కాదు, మానసికంగానూ సత మతమవుతున్నారు. ఇలాంటి మొండివ్యాధికి మెరుగైన చికిత్స అందుబాటులోకి తేవడానికి తాజా పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఫ్రాన్సిస్‌ విలియమ్స్‌ తెలిపారు.
Loading...

Popular Posts